రియల్మీ 9 సీరిస్‌లో తొలి ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. రియల్మీ 9ఐ పేరుతో బడ్జెట్ ప్రెండ్లీ మోడల్‌గా ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. గతంలో వచ్చిన రియల్మీ 8ఐ మోడల్‌కు కొనసాగింపుగా కంపెనీ ఈ కొత్త ఫోన్‌ను పరిచయం చేసింది. ఇందులో వెనుక మూడు కెమెరాలతోపాటు, సంగీత ప్రియుల కోసం డ్యూయల్ స్టీరియో స్పీకర్సు ఉన్నాయి. వీటితోపాటు రియల్మీ 9ఐలో ఎలాంటి ఫీచర్లున్నాయో చూద్దాం.
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారిత రియల్మీ యూఐ2.0 ఓఎస్‌తో పనిచేస్తుంది. 90 హెర్జ్ రిఫ్రెష్‌రేట్, 180 హెర్జ్ టచ్ శాంప్లింగ్ రేట్‌తో 6.6 అంగుళాల హెచ్డీ , డిస్ప్లే ఇస్తున్నారు. డ్రాగన్ ట్రెయిల్ ప్రో గ్లాస్ రక్షణ కూడా ఉంది. స్నాప్ డ్రాగన్ 680 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఎక్స్‌టెండెండ్ ర్యామ్ ఫీచర్ కూడా ఉంది.
ఈ ఫోన్లో మొత్తం నాలుగు కెమెరాలు ఉన్నాయి. వెనుక మూడు, ముందు ఒక కెమెరా ఇస్తున్నారు. వెనుకవైపు 50 ఎంపీ ప్రధాన కెమెరాతోపాటు , రెండు 2 ఎంపి కెమెరాలున్నాయి. ముందుభాగంలో 16 ఎంపి సెల్ఫీ కెమెరా అమర్చారు. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. వందశాతం బ్యాటరీ ఛార్జింగ్ 70 నిమిషాల్లో అయిపోతుందని రియల్మీ చెబుతోంది.
రియల్మీ 9ఐను రెండు వేరియంట్లలో తీసుకొచ్చారు. 4జీబి ర్యామ్ /64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999. 6జీబీ/128 జీబీ వేరియంట్ ధర రూ. 15,999. జనవరి 25 నుంచి రియల్మీ , ప్లిప్కఆర్ట్ వెబ్సైట్ల నుంచి కొనుగోలు చేయొచ్చు. ప్రిసమ్ బ్లాక్, ప్రిసమ్ బ్లూ రంగుల్లో లభిస్తుంది.










