ప్రజాశక్తి- బాపట్ల : ఫార్మా రంగంలో పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు ఉన్నట్లు విశాఖపట్నం సోనిక్ ఫార్మాసిటికల్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ దండమూడి శ్రీకాంత్ తెలిపారు. బాపట్ల ఫార్మసీ కళాశాలలో 27వ వార్షికోత్సవ వేడుకలు బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ కోవిడ్ తర్వాత ప్రపంచం ఫార్మా రంగం వైపు చూస్తుందన్నారు. ఫార్మా రంగలో నైపుణ్యం కల్గిన విద్యార్థులు మెండైన అవకాశాలతో, మంచి స్థాయిలులో స్థిరపడుతున్నారన్నారు. దేశీయంగానే గాక అంతర్జాతీయ, బహుళజాతీయ సంస్థల్లో ఈ రంగంలో అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. విద్యా ర్థులు ఆ అవకాశాలు అంది పుచ్చు కోవాలని కోరారు. బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షుడు ముప్పలనేని శ్రీనివాసరావు మాట్లా డుతూ బాపట్ల ఫార్మసీ కళాశాల పాతికేళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో పలు నూతన ఆవిష్కరణలకు తెరతీస్తూ అనేక మైలు రాళ్ల దాటుకొని విద్యార్థులు లక్ష్యాలను చేరుకునే దిశగా కృషి చేస్తుందన్నారు. అందుకు బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ పూర్తి సహాయ సహకారాలు అంది స్తుందన్నారు.ఈ సందర్భంగా నిర్వహిం చిన ఆటలు, సాంస్కతిక కార్యక్రమాల్లోని విజే తలకు బహు మతులు అందజేశారు. ఈ కార్యక్ర మంలో ప్రిన్సిపల్ టిఇజి.కె.మూర్తి, సొసైటీ కార్యదర్శి మానం నాగేశ్వర రావు, ఉపాధ్యక్షుడు దొప్పలపూడి రామ మోహన్ రావు, గెల్లి దిలీప్ కుమార్, సంయుక్త కార్యదర్శి హరి పద్మ ప్రసాద్, కోశాధికారి తాళ్లూరి రామకష్ణ, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.










