Aug 24,2023 19:57

భూకబ్జాదారి స్వాధీనం చేసుకున్న భూమి

భూకబ్జాదారి స్వాధీనం చేసుకున్న భూమి
ఫారెస్ట్‌ భూమి అన్యాక్రాంతం..!
ప్రజాశక్తి-దగదర్తి:రిజర్వ్‌డు ఫారెస్ట్‌ సర్వేనెంబర్‌ 207 భూమి అన్యాక్రాంతమవుతుంది. అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. వివరాలమేరకు.. మండలంలోని కాట్రాయపాడు సంబంధించిన రిజర్వ్‌ ఫారెస్ట్‌ భూములను అధికార పార్టీ ప్రజా ప్రతినిధి ''నన్నెవరూ ఆపేదని ఉద్దేశంతోనే నేనున్న చూసుకుంటా నీకేం కాదు'' అంటూ ఫారెస్ట్‌ భూములను స్వాధీనం చేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాట్రాయపాడులోని సుమారు 100 ఎకరాలపైగా ఫారెస్ట్‌ భూమిని ఆక్రమించుకున్నారని ఫారెస్ట్‌ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. ఫారెస్ట్‌కు సంబంధించిన భూమి మాది అంటూ అడ్డుకోవడం తప్ప దానిని కాపాడుకోలేకపోతున్నారని తీవ్ర విమర్శలు వెలివేస్తున్నాయి. గూడు లేని ప్రజలకు నివాస స్థలాలు ఇచ్చేందుకు దగదర్తికి కూత వేటు దూరంలో రెవెన్యూ స్థలంలో జగనన్న లేఅవుట్‌ లో ఏర్పాటు చేసి ఉన్నారు.
ఈ భూమి ఫారెస్ట్‌ అంటూ కోర్టు తలుపులను కొట్టారు. ఫారెస్ట్‌ భూములు ఆక్రమణకు గురవుతున్న అధికారులు చూసీ చూడనట్లు పోతున్నారే గాని ఎక్కడ కూడా చర్యలు చేపట్టిన దాఖలాలు లేవని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా ఉన్నత అధికారులు దష్టి సారించి ఫారెస్ట్‌ భూమిని కాపాడాలని కోరుతున్నారు.