Nov 08,2023 21:58

ఫారెస్టు అధికారి ఇంట్లో తనిఖీ చేస్తూ...

ఫారెస్ట్‌ అధికారి ఇంట్లో ఏసీబీ సోదాలు
ప్రజాశక్తి - తిరుపతి బ్యూరో
ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని 14,400 ఫిర్యాదులు రావడంతో ఫారెస్టు అధికారి ఇంట్లో ఏసీబీ సిఐయు అధికారులు సోదా చేశారు. విజయవాడకు చెందిన అధికారులు ఏక కాలంలో ఏడు బృందాలుగా ఏర్పడి దాడులు నిర్వహించారు. మాధవరావు భార్య పేరుతో చెర్లోపల్లి గ్రామంలో 245.4 చదరపు అడుగుల జిప్లస్‌ టు ఇల్లు, మాధవరావు పేరుతో అవిలాలలో 305 చదరపు గజాల జిప్లస్‌ ఫోర్‌ ఇల్లు, పుంగనూరులోని వలపలవారిపల్లి గ్రామంలో 242 చదరపు గజాల జిప్లస్‌ వన్‌ భవనం,రామసముద్రం మండలం ఏటవాకిలి గ్రామం, పుంగనూరు మండలం మిలిమిదొడ్డి మాగంధపల్లె, రాగనపల్లి గ్రామాల్లో 14 ఎకరాల 9 సెంట్ల వ్యవసాయ భూమి, తొండవాడలో ఒకటి, పాత కాలువలో రెండు, మెండగుంటలో ఒకటి మొత్తం నాలుగు ఓపెన్‌ ప్లాట్లు ఉన్నాయి. ఏడు లక్షల విలువ చేసే మారుతీకారు, రెండు ద్విచక్రవాహనాలు, లక్షా 64వేల 900 రూపాయల నగదు, 1062 గ్రాముల బంగారు, 1.5 కిలోల వెండి వస్తువులు, 20 లక్షల 51వేల విలువైన గృహోపకరణాలు, బ్యాంకు బ్యాలెన్స్‌ నాలుగు లక్షలు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఎనిమిది లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు.
ఫారెస్టు అధికారి ఇంట్లో తనిఖీ చేస్తూ...