ప్రజాశక్తి - పుత్తూరు టౌన్ : ప్రభుత్వం ఆదేశాలు మేరకు ప్రతి సంవత్సరం. విశ్రాంతి ఉద్యోగులు. జీవన ప్రమాణ పత్రాలు జాబితాను. ట్రెజరీకి అందజేయాలి. పెన్షనర్ల సంఘం అధ్యక్షులు భాస్కర్ రాజు పేర్కొన్నారు. శనివారం ఉదయం 10 గంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం పుత్తూరు వారి నెలసరి సమావేశం స్థానిక పెన్షనర్స్ భవన్ నందు పెన్షనర్ సంఘం అధ్యక్షులు భాస్కర్ రాజు అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆడిటర్ రామకృష్ణ,రామకృష్ణ సమితి పుత్తూరు అధ్యక్షులు కటారి మునికృష్ణ నాయుడు హాజరైనారు. ఈ సందర్భంగా ముని కృష్ణ ప్రార్థన గీతం ఆలాపించి అందరికీ రామకృష్ణుల దివ్య స్పర్శ" పుస్తకాన్ని అందజేశారు. అనంతరం ముఖ్యఅతిథి ఆడిటర్ రామకృష్ణ విలువలతో కూడిన ఆదాయపు పన్ను విషయాలను కూలంకషంగా సమగ్రంగా వివరించారు. అనంతరం విశ్రాంత ఉద్యోగుల సహా అధ్యక్షులు కేవీ యుగంధర్ రాజు ఈకేవైసీ పై, పెన్షనర్స్ జీవన ప్రమాణ పత్రం జాబితాను అందరికీ తెలియజేసి వెంటనే జీవన ప్రమాణ పత్రాలు సమర్పించాలని.తెలియజే శారు. ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు పుత్తూరు మెయిన్ స్కూల్ నందు స్వయంకృషియన్హిత స్వచ్ఛంద సేవా సంస్థ మరియు అరవింద్ కంటి ఆసుపత్రి తిరుపతి వారి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని జయప్రదం చేయవలసిందిగా అధ్యక్షులు భాస్కర్ రాజు పెన్షనర్స్ ను కోరారు. ఈ ఉచిత కంటి వైద్య శిబిరంలో స్వచ్ఛంద సేవకు గాను పదిమంది వాలంటీర్లు ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అనంతరం పుత్తూరు మండల పెన్షనర్స్ సంఘ గౌరవాధ్యక్షులు టి గుణశేఖర్ రెడ్డి భోజన వసతి కల్పించారు. ఈ కార్యక్రమంలో పెన్షనర్ల ప్రధాన కార్యదర్శి కుప్పయ్య, రామలింగం, రమేష్, గుణశేఖర్ రెడ్డి, నారాయణరెడ్డి, రామచంద్రారాజు, భాస్కర్ రెడ్డి, మేకల సుబ్రమణ్యం,వెంకటకృష్ణ చంద్రశేఖర్ వర్మ, రామమూర్తి, రఘురామయ్య తదితరులు పాల్గొన్నారు.










