ప్రజాశక్తి-పెదబయలు : మండలంలో పెడకోడపల్లి పంచాయతీ సర్పంచి సెగ్గే వెంకట రమణ (40) బుధవారం రాత్రి అకాల మరణం చెందారు. మృతుడు వైస్సార్సీపీ పార్టీ మండల స్థాయి నాయకుడు చురుకైనా పాత్రదారి అరకు ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణ ముఖ్య అనుచరుల్లో ఒకరుగా గుర్తింపు పొందారు. బుధవారం మధ్యాహ్నం పెడకోడపల్లి పంచాయతీకి చెందిన పెదగొంది గ్రామంలో ప్రజా సమస్యలు పరిష్కరించి అనంతరం పంచాయతీలో గల గ్రామ వాలంటీర్లతో సమావేశం నిర్వహించారు. పెడికోడపల్లిలో నూతనంగా నిర్మించిన ఆసుపత్రి ప్రారంభోత్సవానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడాలని ఆదేశించారు. సమావేశం ముగించి పాడేరులో స్వంత ఇంటికి వెళ్లారు. రాత్రి నిద్రిసున్న సమయంలో అలసటగా ఉందని కుటుంబసభ్యులతో తెలిపాడు. వెంటనే స్పందించిన భార్య స్నేహితులు రాత్రి ఒంటి గంట సమయంలో పాడేరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందిన సర్పంచిని వైద్యుని పరీక్షించారు ఐన ప్రయోజనం లేదని మృతి చెందారని వైద్యులు తెలపడంతో రాత్రికి రాత్రి సర్పంచి స్వగ్రామమైన బంగారుపుట్టు గ్రామంలో తరలించారు. సర్పంచ్ వెంకటరమణ మృతిచేండినట్లు సోషల్ మీడిటలో బుధవారం హల్ చ్చల్ చేయడంతో మాజీ మంత్రి కిడారి శ్రవణ్ కుమార్, మాజీ ఎస్సి ఎస్టీ కమిషన్ సభ్యులు (అరకు) సెవెరీ అబ్రహం వైస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి జర్సింగి సూర్యనారాయణ, రాష్ట్ర వ్యవసాయశాఖ డైరెక్టర్ వనాల్బ సన్యాసి, హుకుంపేట జడ్పీటీసీ రెగం మత్య లింగం, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ సమీడ రవి, శంకర్ తనయ సర్పంచి వెంకట పూర్ణిమ, మండల పార్టీ మాజీ అధ్యక్షులు ఏస్ కొండబాబు, మండల ఎంపీటీసీల ఫోరమ్ అధ్యక్షులు కె బొంజుబాబు, మాజీ జడ్పీటీసీ కొంటా సూర్యనారాయణ, లక్ష్మీపేట సర్పంచి లకే అశోక్ కుమార్, గంపరాయి సర్పంచి అచ్చమ్మ, అప్పారావు గలగండ సర్పంచ్ పూజారి లోవిదాసు, ఇంచార్జి ఎంపీడీఓ నరసింగరావులు హాజరై మృతిని కుటుంబసభ్యులను పరామర్శించి ఓదార్చారు. సీతగుంట సర్పంచి పీ మాధవరావు మరియు గంపరాయి గ్రామంలో అంబిడి జగన్నాధం దహన ఖర్చులు మృతిని సతీమణి చిన్నతల్లికి అందించారు. భారీ వర్షం మధ్యలో ప్రముఖ రాజకీయ నాయకులు బందు మిత్రులు అభిమానులు భార్యలు నలుగురు పిల్లలున్నారు.










