కాశినాయన : పెయ్యదూడల అభివద్ధికి ప్రభుత్వం పెద్దపెట్ట వేసి అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టిందని పశువర్ధన శాఖ జెడి శారదమ్మ తెలిపారు. బుధవారం మండల కేంద్రమైన నరసాపురంలోని పశు వైద్యశాల ఆవరణంలో డాక్టర్ రామారావు ఆధ్వర్యంలో ఉత్తమ మేలు జాతి లేగదూడల ప్రదర్శన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు పాడి పరిశ్రమ చేసి నష్టపోకుండా ఉండాలంటే పెయ్యదూడలను పుట్టించే విధంగా ప్రత్యేకమైనటువంటి మందులు వచ్చాయని ప్రతి ఒక్కరూ అలాంటి సూదులను పశువులకు వేయించి కుటుంబ అభివద్ధికి మీరే తోడ్పడాలని పేర్కొన్నారు. ప్రభుత్వం సబ్సిడీ రూపంలో ఇలాంటి మందులు పంపిణీ చేస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు అన్నీ కూడా ఉపయోగించుకోవాలని కోరారు. అక్కడికి దాదాపు 41 మంది రైతులు 73 పెయ్యదూడలను తెచ్చారన్నారు. వాటిలో మేలు జాతి దూడలను అధికారులు ఎన్నిక చేసి వారికి బహుమతులు ప్రధానం చేశారు. వాటికి బ్రూ సెల్లోసిస్ టీకాలు వేశారు. కాల్షియం లివర్ టీకాలని కూడా ఉచితంగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉప సంచాలకులు రమణయ్య, ఇఒ జి.రమేష్, జిల్లా పశుగణాభివద్ధి సంస్థ పశువైద్యాధికారి శివరామిరెడ్డి, ఇటుకల పాడు పశువైద్యాధికారి అశోక్ కుమార్, కలసపాడు, టేకురుపేట, వెంకటాపురం తదితర గ్రామాల పశువైద్యాధికారులు పాల్గొన్నారు.










