Sep 09,2023 20:57

వినతిపత్రం అందజేస్తున్న బిటిఎ నాయకులు

ప్రజాశక్తి-నెల్లూరు :ప్రభుత్వం రద్దు చేసిన మెమో పాసింజర్‌ రైళ్లను తిరిగి పునరుద్ధరించేందుకు కృషి చేయాలని ఎంపి ఆదాల ప్రభాకర్‌రెడ్డికి బహుజన టీచ్చర్స్‌ అసోసియేషన్‌ జిల్లా కమిటీ విజ్ఞఫ్తి చేసింది. శనివారం నగరంలోని ఎంపి ఆదాల ప్రభాకర్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో కలిసి నగరం నుంచి తడ్డ వరకు ప్రయాణిస్తూ ఉద్యోగం చేసుకుంటున్న ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు ఈ మెమో రైళ్లు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయన్నారు. కరోనా ఆంక్షల వల్ల గత రెండేళ్ల నుంచి పాసింజర్‌ రైళ్లను ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. వేణుగోపాల్‌ రెడ్డి, కిరణ్‌, పతాంజనేయులు, రత్నయ్య,హాపీజ్‌,అంకయ్యసుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.