ప్రజాశక్తి-తెనాలి, మంగళగిరి : రుమేనియా దేశంలో ఈనెల 24 నుండి ప్రారంభమైన ప్రపంచ సబ్ జూనియర్, జూనియర్ అండ్ ఎక్విప్డ్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో తెనాలి పట్టణానికి చెందిన షేక్ షబీనా సత్తా చాటారు. గోల్డ్ మెడల్ సాధించి తెనాలి కీర్తిని ఇనుమడింపజేశారు. ఇప్పటికే పవర్ లిఫ్టింగ్‌లో పలు పతకాలను సాధించిన షేక్ షబీనా, ఈనెల 24 నుంచి రుమేనియాలో జరుగుతున్న ప్రపంచ సబ్ జూనియర్ ఎక్విప్డ్ పవర్ లిఫ్టింగ్‌లో శనివారం రాత్రి జరిగిన పోటీల్లో 84 కిలోల విభాగంలో బంగారు పతకాన్ని సాధించినట్లు కోచ్ షేక్ సంధాని తెలిపారు. బెంచ్ ప్రెస్‌లో 4వస్థానం, డెడ్ లిఫ్ట్‌లో బ్రాంజ్ మెడల్ సాథించి రాష్ట్రానికే తలమానికంగా నిలిచారు. ఈ సందర్భంగా ఆమెను సౌత్ ఇండియా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్.కోటేశ్వరావు, రాష్ట్ర అధ్యక్షులు ఎం.ప్రభాకర్, కార్యదర్శి ఎస్.సూర్యనారాయణ, జిల్లా అధ్యక్షులు కె.విజయ భాస్కర్‌రావు అభినందనలు తెలిపారు. షబీనా మంగళగిరి ఫిట్‌జోన్ సెంటర్‌లో శిక్షణ పొందతున్నారు.










