Aug 15,2023 00:22

పతకాలతో నాగజ్యోతి

ప్రజాశక్తి-కొత్తకోట:రాష్ట్రస్థాయి పవర్‌ లిఫ్టింగ్‌ పోటీలలో కొత్తకోట గ్రామానికి చెందిన ఉపాధ్యాయిని నాగజ్యోతి రెండు బంగారు పతకాలు సాధించింది. ఏపీ స్టేట్‌ పవర్‌ లిఫ్టర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సిడబ్ల్యూసి హౌసింగ్‌ బోర్డ్‌ కాలనీ పెదగంట్యాడ (గాజువాక)లో 13న ఆదివారం నిర్వహించిన 2వ ఏపీ స్టేట్‌ డిడ్‌ లిఫ్ట్‌ ఛాంపియన్షిప్‌ అండ్‌ 5వ ఏపీ స్టేట్‌ బెంచ్‌ ప్రెస్‌ ఛాంపియన్షిప్‌- పవరలిఫ్టింగ్‌ పోటీలలో 72 కేజీల విభాగంలో పీవీఎం నాగజ్యోతి రెండు బంగారు పతకాలు సాధించింది. రోలుగుంట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయనిగా విధులు నిర్వహిస్తున్న ఆమె ఆగస్టు 25 నుంచి 27 వరకు చత్తీస్గఢ్‌లో జరిగే జాతీయ స్థాయి పవర్‌ లిఫ్టింగ్‌ పోటీలకు కూడా ఎంపిక అయ్యింది. ఆమె కుమార్తె సాహితి నీటిలో గంటలు తరబడి పలు విన్యాసాలు ప్రదర్శించి పలు అవార్డులతో పాటు రాష్ట్రపతి అవార్డు పొందింది. నాగజ్యోతిని ఉపాధ్యాయులు అభినందించారు.