Dec 19,2022 23:26

జెసిబితో గండి పూడ్చుతున్న దృశ్యం

ప్రజాశక్తి -సీలేరు
సీలేరు కాంప్లెక్స్‌ పరిధిలో దిగువ సీలేరు డొంకరాయి పవర్‌ కెనాల్‌కు ఇటీవల పడిన గండిని పూడ్చే పనులు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఎపి జెన్‌కో ఎస్‌ఈ సివిల్‌ కెకెవి.ప్రశాంత్‌ కుమార్‌ మాట్లాడుతూ మరమ్మతు పనులకు ఏపీ జెన్కో ఉన్నతాధికారుల నుంచి అనుమతులు మంజూరైనట్లు చెప్పారు. కెనాల్‌ గండి మరమ్మతు పనులు స్థానిక కాంట్రాక్టర్లకే అప్పచెప్పమన్నారు. ఇంజనీర్లు నిరంతర పర్యవేక్షంలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ఎటువంటి అపోహాలకు తావు లేకుండా పనులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.