Jul 10,2023 23:43

దిష్టిబొమ్మను దహనం చేస్తున్న వాలంటీర్లు

ప్రజాశక్తి - కాకినాడ రూరల్‌
జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ ఏలూరు సభలో వాలంటీర్లపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ కాకినాడ రూరల్‌ సర్పవరం జంక్షన్‌ వద్ద వాలంటీర్లు ధర్నా నిర్వహించి పవన్‌ కళ్యాణ్‌ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వాలంటీర్లు మాట్లాడుతూ తక్షణమే పవన్‌ కళ్యాణ్‌ వాలంటీర్లకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను నిష్పక్షపాతంగా ప్రజలకు చేరువ చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నామన్నారు. ప్రజల్లో ఎనలేని నమ్మకాన్ని సంపాదించి ప్రభుత్వానికి వెన్నెముఖలా ఉన్నామనానరు. కరోనా సమయంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహించామన్నారు. ఆటువంటి తమను కించ పరిచేలా పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. తక్షణమే పవన్‌ కళ్యాణ్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.