
ప్లకార్డులు ప్రదర్శిస్తున్న వలంటీర్లు
ప్రజాశక్తి-గొలుగొండ:వలంటీర్లపై పవన్‌కళ్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరశిస్తూ గురువారం గొలుగొండ మండలం ఏఎల్‌పురంలో వలంటీర్లు ధర్నా చేపట్టారు. వీరంతా గ్రామ సచివాలయం నుండి ప్లకార్డులు చేతబట్టి నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు. అనంతరం శరభన్నపాలెం జంక్షన్ వద్ద మానవహారం నిర్వహించి పవన్‌కళ్యాణ్ తక్షణమే వలంటీర్లకు క్షమాపణ చెప్పాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎల్‌పురం, సిహెచ్.నాగాపురం, పాతకేడిపేట గ్రామాల వలంటీర్లు పాల్గొన్నారు.