
ప్రజాశక్తి-అవనిగడ్డ : అవనిగడ్డలో నాలుగో విడత వరాహి యాత్ర ప్రారంభం కానున్న దృష్ట్యా ఆదివారం సాయంత్రం పవన్ కళ్యాణ్ బహిరంగ సభ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేయను ఉండటంతో అందుకు సంబంధించిన ఏర్పాట్లను ఆ పార్టీ నాయకు లు బొమ్మ రంగా నిర్వహిస్తు న్నారు. కృష్ణ గుంటూరు జిల్లాల నుంచి లక్షలాదిగా పార్టీ కార్యకర్తలు అభిమానులు తరలి వస్తారని ఆశిస్తున్న నేపథ్యంలో వారికి తోడు తెలుగుదేశం పార్టీకి చెందిన శ్రేణులు కూడా పెద్ద సంఖ్యలో హాజరవుతారని భావిస్తు న్నారు. దీనితో ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ, మచిలీపట్నం ఇంచార్జ్ బండి రామకష్ణ ఆధ్వ ర్యంలో ఏర్పాట్లను నిర్వహి స్తున్నారు.