Jul 12,2023 21:38

పార్వతీపురం: ఎస్‌పికి వినితి పత్రాన్నిస్తున్న జనసేన నాయకులుఅనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు

ప్రజాశక్తి- పార్వతీపురం 
జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ పై ఎపి వాలంటీర్స్‌ అనుచిత వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమని వెంటనే చర్యలు తీసుకోవాలని బుధవారం పార్వతీపురం మన్యం జిల్లా ఎస్‌పికి జనసేన నియోజకవర్గ నాయకులు అక్కివరపు మోహన్‌ రావు ఆధ్వర్యంలో వినత పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో వాలంటీర్‌ వ్యవస్థలో ఉన్న లోపాలని ఎత్తిచూపితే వాటిని సరి చేసుకోకుండా తిరిగి జనసేన అధినేతపై దుర్భాషలాడటం అన్యాయమన్నారు. రాష్ట్రంలో పాలన మారాలంటే పవన్‌ రావాలని కోరారు. రైతులకు అండగా నిలవాలన్నా, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించా లన్న పవన్‌ వల్లే సాధ్యమన్నారు. అనంతరం పార్వతీపురం వినాయక గుడి వద్ద పవన్‌ కళ్యాణ్‌ ఫోటోకి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం, సీతానగరం, బలిజిపేట మండల అధ్యక్షులు ఆగూరు మని, పాటి శ్రీను, బంకురు పోలినాయుడు, జనసేన వీర మహిళా నాయకులు బోనెల గోవిందమ్మ, ఇందు, అనిల్‌ చంద్రక, రాజన్నబాలు, స్వామినాయుడు, అప్పలనాయుడు,ఖాతా విశ్వేశ్వరరావు, రెడ్డి కరుణ, చిట్లు గణేశ్వరరావు, గొర్ల చంటి, గుంట్రెడ్డి గౌరీ శంకర్‌, రాజాన రాంబాబు, కర్రీ మణికంఠ, సురేష్‌, అన్నా బత్తుల దుర్గాప్రసాద్‌, నాని, పైల అప్పలరాజు, పైల శ్రీను, అక్కెన భాస్కర్‌, బలరాం, ప్రవీణ్‌, దుర్గ, కేశవరావు, పోల్‌ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
గుమ్మలక్ష్మీపురం: రాష్ట్రంలో ఇటీవల మహిళలు వరుసగా హత్యాచారాలకు గురవుతున్నప్పుడు ప్రశ్నిస్తే తప్పా అని ఇరిడి ఎంపిటిసి, జనసేన నాయకులు కడ్రక మల్లేశ్వరావు స్థానిక ఎమ్మెల్యేకి ప్రశ్నించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ స్థానిక ఎమ్మెల్యే స్పందించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పవన్‌ కళ్యాణ్‌ వాలంటీర్లు ఎవరిని కించపరచలేదని వాలంటీర్లు పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వారి అర్హత తగ్గ ఉద్యోగులు ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. ప్రతిభకు తగ్గ గౌరవ వేతనం ఎందుకు ఇవ్వడంలేదని, మీ చదువుకు తగ్గ ఉద్యోగాలు ఎందుకు కల్పించడం లేదని, ఇంకెంతకాలం శ్రమను దోపిడీ చేస్తారని ప్రభుత్వన్ని వాలంటీర్లు నిలదీయాలని ఆయన కోరారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ కేవలం వైసిపికే కాకుండా రాష్ట్ర మొత్తానికి చైర్‌పర్సన్‌ అన్న సంగతి గుర్తుంచుకోవాలన్నారు. వైసిపికి లబ్ధి చేకూర్చేందుకు కేవలం జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌కి నోటీస్‌ ఇస్తే సరిపోదన్నారు. రాష్ట్రంలో మహిళల పట్ల జరుగుతున్న దాస్టీకాలు, దౌర్జన్యాలకు కారకులైన ప్రతీ ఒక్కరికి నోటీసులు ఇచ్చి వివరణ తీసుకొని రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.
సాలూరు: రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం తీసుకొచ్చిన వాలంటీర్ల వ్యవస్థ రాజ్యాంగ విరుద్ధమని జనసేన నాయకులు రేగు మహేష్‌ చెప్పారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వాలంటీర్లపై జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆయన దిష్టిబొమ్మలు దగ్ధం చేయడం సరికాదన్నారు. అధికార పార్టీ నాయకులే వాలంటీర్లను ఉసిగొల్పి ఆందోళన చేయించడం చూస్తుంటే ప్రభుత్వం జనసేనానిని చూసి భయపడుతున్నట్లు అర్ధమవుతోందని చెప్పారు. ఎపి మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ వైసిపి నాయకురాలిగా వ్యవహరించారన్నారు. రాష్ట్రంలో ఎంతోమంది మహిళలు హత్యలు, అత్యాచారాలకు గురవుతుంటే మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. విలేకరుల సమావేశంలో జనసేన నాయకులు శివకృష్ణ ఉన్నారు.