ప్రజాశక్తి - ఏలూరు అర్బన్
ఆదికవి నన్నయ యూనివర్సిటీ పిఆర్‌ఒగా సేవలందిస్తున్న పువ్వల ఆనంద్‌కు గుఱ్ఱం జాషువా 128వ జయంతిని పురస్కరించుకొని గుఱ్ఱం జాషువా సాహితీ పురస్కారాన్ని ఫిలాంత్రోఫిక్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రకటించింది. సొసైటీ వ్యవస్థాపకులు అద్దంకి రాజాయోనా మంగళవారం దీనికి సంబంధించిన వివరాలు పత్రికలకు తెలియజేశారు. ఈనెల 28వ తేదీన ఏలూరులో జరిగే జాషువా జయంతి కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాహిత్య అకాడమీ ఛైర్‌పర్సన్ పిళ్లంగోళ్ల శ్రీలక్ష్మి చేతుల మీదగా పురస్కారాన్ని అందిస్తున్నామని తెలిపారు. తెలుగు సాహిత్య అభిలాషతో జర్నలిస్టుగా, సాహిత్య కార్యక్రమాలకు సాంకేతికతను జోడించి సమాజానికి అ ందిస్తున్నారన్నారు. ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ సమాచారాన్ని వార్తా పత్రికలతో పాటు, నన్నయ న్యూస్ టివి వంటి వినూత్న సోషల్ మీడియా సాధనాల ద్వారా ప్రజలకు అందిస్తున్నారని తెలిపారు. ఆనంద్ ఆయా సాహిత్య కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడంతో పాటు పర్యావరణం, ప్రజారోగ్యం, యోగా, సమాజంలో మీడియా పాత్ర వంటి ఆన్‌లైన్ జాతీయ సదస్సులను ని ర్వహించారన్నారు. గతంలో చేసిన సాహిత్య సామాజిక కార్యక్రమాలు గుర్తించి ఆయనకు










