Apr 29,2023 22:54

మాట్లాడుతున్న జయచంద్‌

ప్రజాశక్తి-గుంటూరు : పుట్టగొడుగుల పెంపకం ద్వారా యువ పారిశ్రామికవేత్తలుగా రాణించవచ్చని తనుశ్రీ మష్రుమ్స్‌ ఇండిస్టీస్‌ వ్యవస్థాపకులు టి.జయచంద్‌ అన్నారు. శనివారం స్థానిక ప్రభుత్వ మహిళా కళాశాల డిపార్ట్మెంట్‌ ఆఫ్‌ మైక్రోబయాలజీ, డిపార్ట్మెంట్‌ ఆఫ్‌ ఫుడ్‌ టెక్నాలజీ సంయుక్త ఆధ్వర్యంలో మష్రుమ్స్‌ ఫలసాయ పెంపకంపై విద్యార్థినులకు అవగాహనతోపాటు ఒకరోజు వర్క్‌షాప్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా జయచంద్‌ మాట్లాడుతూ వేడి వాతావరణానికి తట్టుకుంటూ రూ.500 పెట్టుబడితో, ఒక కిలో విత్తనాలతో ఎనిమిది కిేలోల పుట్టగొడుగుల ఫలసాయం ద్వారా రూ.2వేలు ఆదాయం పొందవచ్చని చెప్పారు. పుట్టగొడుగుల ఆహారంలో శాఖాహారులకు మాంసాహారులతో సమానమైన ప్రోటీన్స్‌, ఫైబర్‌, విటమిన్‌లు పుష్కలంగా లభిస్తాయని చెప్పారు. పుట్టగొడుగులలో యాంటీ ఆక్సిడెంట్సు, యాంటీ ఇన్ఫర్మేటరీ గుణాల ద్వారా రోగ నిరోధక శక్తి పెరగడం ద్వారా కేన్సర్‌ వంటి భయానక వ్యాధుల నుండి రక్షించబడవచ్చునని వివరించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ బి.ఆర్‌ జోష్ణాకుమారి, మైక్రో బయాలజీ హెడ్‌ ప్రవీణ కుమారి, ఫుడ్‌ టెక్నాలజీ హెడ్‌ విజయశ్రీ, అధ్యాపకులు డాక్టర్‌ సుచరిత, అరుణ, మాధురి పాల్గొన్నారు.