Oct 29,2023 21:42

ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం
   మండలంలోని పుట్లగట్లగూడెం పంచాయతీ కార్యాలయాన్ని డిపిఒ శ్రీనివాస విశ్వన్యాద్‌ ఆకస్మిక తనిఖీ చేశారు. ఆదివారం క్షేత్రస్థాయిలో జరుగుతున్న స్వమిత్వ గృహాల సర్వేను తనిఖీ చేసి కొలతలు నమోదు చేశారు. అనంతరం గ్రామంలో ప్రగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా డిపిఒ మాట్లాడుతూ స్వమిత్వ సర్వే ద్వారా ప్రజలకు ఎంతో మేలని అన్నారు. ప్రభుత్వ ప్రధాన అజెండా అంశమైన స్వమిత్వ సర్వేని కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ ఆదేశాలతో గడువు లోపు పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.