Apr 24,2023 02:23
పుస్తకాలను చూపుతున్న యువతీ యువకులు

ప్రజాశక్తి-బాపట్ల: పుస్తకాలు విజ్ఞాన జ్యోతులను వెలిగించి మానవ జీవితాలను ప్రకాశింప చేస్తాయని భావపురి పుస్తక ఉద్యమ సమితి అధ్యక్షులు పిసి సాయిబాబా అన్నారు. ఆదివారం అంతర్జాతీయ పుస్తక దినోత్సవం సందర్భంగా బాపట్ల ఏవివి హైస్కూల్లో భావపురి పుస్తకోద్యమ సమితి ఆధ్వర్యంలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. సాయిబాబా మాట్లాడుతూ జీవితమనే నదిని దాటడానికి పుస్తకాలు దారి చూపే రెక్కల నిస్తాయన్నారు. తెలియని లోకాలలో విహరించడానికి మనకు దోహదపడతాయని పేర్కొన్నారు. మానవ మేధో వికాసానికి ఎంతగానో ఉపకరిస్తాయన్నారు. పుస్తక పఠనం మెదడుకు వ్యాయామాన్ని అందిస్తుంది. మనిషిలో సృజనాత్మకతను పెంపొందిస్తుంది. విద్యార్థులచేత తొలుత తప్పనిసరిగా పుస్తకాలు చదువుతామని. 'పుస్తక ప్రతిజ్ఞ'ను చేయించారు. పుస్తక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీలలో విజేతలకు బహుమతులు, ప్రశంసా పత్రాలు ప్రదానం చేశారు. కార్యక్రమంలో చిత్రకారుడు జీవి, పబ్లిక్‌ స్కూల్‌ ఉపాధ్యాయులు బ్రహ్మానంద శర్మ, విద్యార్థులు పాల్గొన్నారు.