ప్రజాశక్తి-విజయవాడ
పుస్తక పఠనంతో ప్రతి ఒక్కరూ తమ ఉజ్వల భవిష్యత్‌కు పునాది వేసుకోవచ్చునని గ్రంథాలయ అధికారి కె రమాదేవి అన్నారు. ఆదివారం స్థానిక ఠాగూర్ గ్రంథాలయంలో నిర్వహించిన కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ గ్రంథాల యాలను ఆలంబనగా చేసుకొని పుస్తక పఠనం ద్వారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వంటి మహనీయులు ప్రపంచ మేధావిగా ఎదిగారన్నారు. భారత రాజ్యాంగ రచనకు ఆయన చేసిన గ్రంథ పఠనం ఎంతగానో తోడ్పడిందన్నారు. ప్రతి ఒక్కరూ గ్రంథాల యాలను వినియోగించుకొని పుస్తక పఠనం ద్వారా విజ్ఞాన వంతులు కావాలని కోరారు.ఠాగూర్ గ్రంథాల యంలో నిర్వహిస్తున్న పుస్తక పఠనం కార్యక్రమానికి తల్లిదండ్రులు తమ చిన్నారులను హాజయ్యేలా శ్రద్ద తీసుకొని వారి వ్యక్తిత్వ వికాసానికి బాటలు వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది డి రమేష్, బిడిసి నిర్వహకులు జి ఝాన్సీ, భగవత్‌గీత, స్కూల్ విద్యార్ధులు పాల్గొన్నారు.










