Nov 15,2023 20:35

మదనపల్లి : గ్రంథాలయలంలో పుస్తక ప్రదర్శనను తిలకిస్తున్న విద్యార్థులు

కలకడ : పుస్తక పఠనంతో మేథోశక్తి పెరుగుతుందని కలకడ గ్రంథాల య శాఖ అధికారి అమరనాథ తెలిపారు. బుధవారం గ్రంథాలయ వారోత్స వాల్లో భాగంగా రెండవ రోజు పుస్తకపఠన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. స్థానిక పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు ఇచ్చి వారి చేత చదివించడం జరిగిందని తెలిపారు. విద్యార్థిదశలో పుస్తకాలు, దినపత్రికలు, వార పత్రికలు, మాస పత్రికలు, చదవడం అలవాటు చేసుకోవాలని సూచించారు.పుస్తకాలను చదవడం అలవాటు చేసుకుంటే ప్రతి ఒక్కరిలో మేథోశక్తితో పాటు ఉల్లాసంగా ఉండేందుకు మరియు తెలివితేటలు పెంచు కునేందుకు దోహదపడేందుకు అవకాశాలున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.మదనపల్లె : కురబ లకోట మండ లంలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. రెండవరోజు పుస్తక ప్రదర్శన నిర్వహించారు.గ్రంథాలయ అధికారి బి.చంద్ర శేఖర్‌నాయక్‌ మాట్లాడుతూ గ్రంథాలను ఉపయోగించుకొని పుస్త కం విజ్ఞా నాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎ.పద్మావ తమ్మ, ప్రసాద్‌, విద్యార్థులు పాల్గొన్నారు.చకలికిరి : ప్రతి ఒక్కరూ పుస్తక పఠనం అలవర్చుకోవాలని కలికిరి గ్రంథాలయ శాఖ అధికారి విజయ కుమార్‌ విద్యార్థిని విద్యార్థులను కోరారు. 56వ జాతీయ గ్రంధాలయ వారోత్సవాలలో భాగంగా స్థానిక గ్రంధాలయంలో పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రంధాలయ అధికారి విజయకుమార్‌ అధ్యక్షతన అక్షర ఇంగ్లీష్‌ మీడియం పాఠశాల విద్యార్థులు శ్రీని వాస డిగ్రీ కాలేజీ, విద్యార్థులు యువత మాదకద్రవ్యాల నివారణపై ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులను ఉద్దేశించి ఆయాన మాట్లాడుతూ విద్యార్థులకు మాదకద్రవ్యాల వలన కలిగే నష్టాలను వివరించారు. విద్యా ర్థులు జీవితంలో ఒక గమ్యం ఏర్పరుచుకోవాలని, వారు గమ్యం చేరడానికి గ్రంధాలయాలు మంచి మార్గమని అన్నారు. గాలివీడు: పుస్తకాలను చదవడం ద్వారా పఠన సామర్థ్యాన్ని పెంపొందించుకోవచ్చని గాలివీడు గ్రంథాలయ శాఖ అధికారి రామచంద్రనాయక్‌ పేర్కొన్నారు. 56వ జాతీయ గ్రంథాల వారోత్సవాలలో భాగంగా బుధవారం గ్రంధాలయ శాఖలో పుస్తక ప్రదర్శన నిర్వహించారు. బి.కొత్తకోట : బి.కొత్తకోట శాఖా గ్రంధాలయంలో పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేశారు. పుస్తక ప్రదర్శనలో స్థానిక బాలికొన్నత పాఠశాల విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్‌ బాలికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి.భాస్కర్‌ పాల్గొ న్నారు. ఈ సందర్భంగా గ్రంథాలయ అధికారి ఎం.తులసినాయక్‌ మాట్లా డుతూ పిల్లలు కొరకు ప్రత్యేకంగా యాభై రూపాయలకే సభ్యత్వం ఇవ్వను న్నట్లు తెలిపారు.. వారం రోజులు పాటు జరిగే ఈ గ్రంథాలయ వారో త్సవాల్లో ప్రతిరోజు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగు తుంద న్నారు.ఈ అవకాశాన్ని విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.నందలూరు : స్థానిక గ్రంథాలయాన్ని ఉపసంచాలకులు శ్రీనివా సులురెడ్డి, కార్యదర్శి అమీరుద్దీన్‌ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల పుస్తక ప్రదర్శనను, డ్రాయింగ్‌ పోటీలను పరిశీలించి విద్యార్థులను పలు ప్రశ్నలను అడిగి జవాబులు రాబట్టారు. కార్యక్రమంలో ఎంఇఒ అనంతకష్ణ, ఉపాధ్యాయులు కపానందం, వెంకటసుబ్బయ్య విద్యార్థులు పాల్గొన్నారు. తంబళ్లపల్లి: స్థానిక తంబళ్లపల్లి గ్రంథాలయంలో 56వ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా గ్రంధాలయ చైర్మన్‌ నైనారు మధుబాల ఆదేశాల మేరకు జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి శర్మ ఉత్తర్వుల మేరకు గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎంపిడిఒ సురేంద్రనాథ్‌, ఎంఇఒ త్యాగరాజు, మండలాభివద్ధి చైర్మన్‌ నారాయణరెడ్డి, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు పురు షోత్తమచారి, గ్రంథాలయ అధికారి జిలానిబాషా, విద్యార్థులు పాల్గొన్నారు.తంళ్లపల్లె : వైఎస్‌ఆర్‌ క్రాంతి పథకం మహిళా సంఘ సభ్యులు శ్రీనిధి రుణాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివద్ధి చెందాలని శ్రీనిధి మేనేజర్‌ అమరావతి కోరారు. బుధవారం శ్రీశక్తి భవన్‌లో సంఘమిత్ర లు విఒ లీడర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మండలంలో మహిళా సభ్యులకు రూ.4.36 కోట్లు రుణాల పంపిణీకి లక్ష్యంగా ఎంచుకున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు రూ.3.74 కోట్ల రూపాయలు పంపిణీ జరిగిందన్నారు. త్వరలో అనుకున్న లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు సంఘమిత్రలు సిసిలు, విఒ లీడర్లు సమిష్టి గా కషి చేయాలన్నారు. మహిళా సభ్యులు తీసుకున్న రుణాలను సక్రమంగా సకాలంలో చెల్లించే విధంగా చొరవ చూపాలన్నారు. సమావేశంలో ఎపిఎం గంగాధర్‌, సిసిలు భవానిశంకర్‌, ఆదిలక్ష్మి పాల్గొన్నారు.