Jul 10,2023 01:13
పుస్తక మహాసభ గోడిపతులను ఆవిష్కరిస్తున్న దృశ్యం

ప్రజాశక్తి-బాపట్ల: నేటి తరాన్ని పుస్తక పఠనం వైపు దృష్టి మళ్లించడానికి పలు సంస్థలు మరో గ్రంథాలయ ఉద్యమానికి శ్రీకారం చుట్టాయని భావపురి పుస్తకోద్యమ సమితి అధ్యక్షుడు పిసి సాయిబాబా ఉన్నారు. ఆదివారం బాపట్ల శాఖ గ్రంథాలయంలో మరో గ్రంథాలయ ఉద్యమం గోడ ప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సాయిబాబా మాట్లాడుతూ పుస్తక పఠనంలో ఉన్న రుచిని, పసను యువతీ యువకులకు తెలియ చెప్పడమే ఈ ఉద్యమం లక్ష్యమన్నారు. విద్యార్థులందరి పుస్తక పఠనంవైపు ఆకర్షితులను చేయడమే ధ్యేయంగా ఈ సంస్థలు పనిచేస్తున్నాయన్నారు. మరో గ్రంథాలయ ఉద్యమ మొదటి మహాసభ ఈ నెల 16వ తేదీ విజయవాడలోని బెంజ్‌ సెంటర్‌ వద్ద గల సర్వోత్తమ భవన్‌లో జరుగుతుందన్నారు. దీనికి సంబంధించిన గోడిపతులను శాఖా గ్రంథాలయంలో విడుదల చేయడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ పాల్గొని సభను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో శాఖా గ్రంథాలయ అధికారి ఏ శివాజీ గణేషన్‌, సమితి కార్యదర్శి జీవి, కోశాధికారి ఏ మల్లికార్జున పాల్గొన్నారు.