స్వేదంతో సిరులు పండించిన రైతు..
హలం విశ్రాంతి కోరితే..
ఎన్ని కోట్ల డొక్కలు ఎండునో..
మరి ఆ కర్షకుడి డొక్కలు నింపేదెవ్వరు..
కష్టాలు తీర్చేదెవ్వరు
ధాన్యం రాశులు పండించేటోడికి
పట్టెడు మెతుకులు కరువౌతుంటే
దళారీగా మారినోడు దర్జాగా బతుకుతుంటే
నింగి నివ్వెరపోయింది ఈ వింతను చూసి.
పుస్తెలతాడు తాకట్టు పెట్టి.
బురదనేలలో బతుకు ఈడ్చెటోడికి
పంటను కాపాడలేని పురుగుల మందు
రైతు ప్రాణాలు నిలువునా తీస్తుంటే
ప్రకృతి విలపిస్తుంది పుత్రశోకంతో
రైతన్నకు ఎంత కష్టం ఎంత కష్టమంటూ !
- రాము కోలా
9849001201