
ప్రజాశక్తి-గొలుగొండ:జోగుంపేటలో 1997-98 సంత్సరంలో పదవ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు 25 సంవత్సరాల తరువాత జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం వేడుకగా పూర్వ విద్యార్థుల కలయికను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పూర్వ ఉపాధ్యాయులు ప్రకాష్, సింగంపల్లి అప్పలరాజులు హాజరయ్యారు. పూర్వ విద్యార్థులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ, పాఠశాలతో, విద్యార్థులతో ఎంతో విడదీయరాని బంధం అని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను కలవడం ఆనందంగా ఉందని వారు తెలిపారు. అనంతరం పూర్వ విద్యార్థులంతా ఉపాధ్యాయులను సత్కరించారు. అనంతరం విద్యార్థులు తీపి గుర్తులను నెమరు వేసుకొన్నారు. ఈ కార్యక్రమంలో పండా శ్రీను, గాదె.హేము, గాదె శివ కృష్ణ, కక్కిరాల నాగేశ్వరరావు, అనిమిరెడ్డి మారుతి నాయుడు, సాయం వెంకటలక్ష్మి బైపురెడ్డి సురేష్, రాయపురెడ్డి శివ, విద్యార్థులు పాల్గొననారు.