పాల్గొన్న పూర్వ విద్యార్థులు
ప్రజాశక్తి-మాడుగుల: మాడుగుల జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో 1995-96 బ్యాచ్‌కు చెందిన పదవ తరగతి విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రతిష్టించారు. విశ్రాంత ఉపాధ్యాయులు రామ్ మోహన్ రావు చేతుల మీదుగా విగ్రహ ఆవిష్కరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో జవ్వాడి వరహాలు, దంగేటి మోహన్, ఏర్రంశెట్టి గణేష్, కర్రి ప్రకాష్, నూకరాజు, వాసు, జగన్నాథరావు, రాజా పాల్గొన్నారు.










