
ప్రజాశక్తి - మొగల్తూరు
మొగల్తూరు పెనుమత్స రంగరాజు జెడ్‌పి ఉన్నత పాఠశాలలో 1971-72 విద్య సంవత్సరంలో పదో తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు ఆదివారం పాఠశాల ఆవరణలో ఆత్మీయ సమ్మేళనం అయ్యారు. 51 ఏళ్ల తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు ఆత్మీయంగా పలకరించుకుని ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆహ్లాదంగా గడిపారు. ఆనాడు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులు దశక సుబ్రహ్మణ్యం, రంగనాథచార్యులు, అప్పలరాజులతో పాటు పలువురిని ఘనంగా సత్కరించారు. పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేసేందుకు తీర్మానించారు. పాఠశాల అభివృద్ధికి విశాఖపట్నంలో స్థిరపడిన వ్యాపారవేత్త గాదె మోహన్‌రావు రూ.50 వేలు విరాళంగా అందించారు. అనంతరం సహపంక్తి భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో విశ్రాంతి ప్రిన్సిపల్ కెవిసిఎస్.అప్పారావు, ఇస్రో విశ్రాంత శాస్త్రవేత్త కె.ఆంజనేయులు, నేత్ర వైద్యులు అయితం ప్రకాష్, విశ్రాంత బ్యాంకు ఉద్యోగి పి.విజరువెంకటేష్, అనంతపల్లి సూర్యనారాయణ పాల్గొన్నారు.