May 01,2023 01:13
ఒక్కచోట చేరిన పూర్వ విద్యార్థులు

ప్రజాశక్తి-నిజాంపట్నం: నిజాంపట్నం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 1988-89 పదవ తరగతి టైటాన్‌ బ్యాచ్‌ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా జరిగింది. తమకు విద్యాబుద్ధులు చెప్పిన నాటి గురువులను పూర్వ విద్యార్థులు శాలువాలతో ప్రత్యేకంగా ఘనంగా సన్మానించారు. అనంతరం పూర్వ విద్యార్థులు అందరూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. వివిధ వృత్తులలో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలలో స్థిరపడిన పూర్వ విద్యార్థులు తమ గత స్మృతులను నెమరువేసుకుంటూ తాము చదువుకున్న పాఠశాలలో కలియ తిరిగి తమ అనుబంధాలను స్మరించుకున్నారు. తమ విద్య, వైవాహిక, ఉద్యోగ జీవిత విశేషాలు, కుటుంబ నేపథ్యాల విషయాల గురించి ఒకరికొకరు చెప్పుకుంటూ, సెల్ఫీలు, ఫోటోలు తీసుకుంటూ ఎంతో ఆనందోత్సాహాలతో గడిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంఈఓ కె హరిబాబు పాల్గొనగా పూర్వ విద్యార్థులు ప్రసాదం వాసుదేవ, నర్రా నాగేశ్వరరావు, మోపిదేవి నాగరాజు, అబ్దుల్‌ సలీం, కొత్వల్‌ మౌలా సాహెబ్‌, నిజాంపట్నం మల్లికార్జునరావు, జిడుగు రాజా, మోపిదేవి శ్రీనివాసరావు, మరకా శ్రీనివాసరావు, నజీర్‌ అహమ్మద్‌, మెండు వెంకట రత్నరావు, పీతా సుబ్బారావు, షేక్‌ ఖలీల్‌ తదితర పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.