Jun 29,2023 20:05

సమ్మేళనంలో పాల్గొన్న పూర్వ విద్యార్థులు

ప్రజాశక్తి - మంత్రాలయం
మండలంలోని విద్యానగర్‌ గ్రామంలో ఉన్న ఎస్‌వికెవి పాఠశాలలో 1995-96లో పదో తరగతి చదువుకున్న విద్యార్థుల అపూర్వ సమ్మేళనం గురువారం ఘనంగా నిర్వహించారు. పదో తరగతిలో జరిగిన తీపి గుర్తులను గుర్తు చేసుకుంటూ ఒకరినొకరు పలుకరించుకుంటూ సరదాగా గడిపారు. అప్పట్లో చదువు చెప్పిన గురువులకు వందనం చేస్తూ ఘనంగా సన్మానించారు. అనంతరం పాఠశాల ఇన్‌ఛార్జీ లక్ష్మి కాంత్‌ మాట్లాడారు. పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు పాఠశాల అభివృద్ధికి సహకారం అందించాలని కోరారు. 49 ఏళ్లుగా ఎయిడెడ్‌ పాఠశాలగా ఉండేదని, ఆ పాఠశాల ఇటీవల కాలంలో ప్రభుత్వ పాఠశాలగా మారిందని తెలిపారు. వచ్చే సంవత్సరం జూన్‌ 24న 50 ఏళ్లు పూర్తి చేసుకుని సంబరాలు చేసుకుంటామని చెప్పారు. పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థులు తగిన సహకారం అందించాలని కోరారు. ఇక్కడ చదివిన విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగారని, మళ్లీ ఇప్పుడు కలుసుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ... ఎక్కడో ఉన్న విద్యార్థులందరూ 27 ఏళ్ల తర్వాత కలుసుకోవడం, బాల్యంలోని మధుర స్మృతులను గుర్తు చేసుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. తమకు చదువు చెప్పిన గురువులను సన్మానించుకోవడం సంతోషంగా ఉందన్నారు. విశ్రాంత ఉపాధ్యాయులు లక్ష్మి రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, రామ్మూర్తి, జానకి రామిరెడ్డి, రంగన్న, కేశవరెడ్డి, ఎన్‌టి.ఈరన్న, తండా సర్పంచి భారతమ్మ, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.