May 14,2023 17:25

ఉపాధ్యాయులతో పూర్వ విద్యార్థులు

పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం
 ప్రజాశక్తి - చాగలమర్రి

      చాగలమర్రి పట్టణంలోని ఆర్ సి ఎం ఉన్నత పాఠ శాలలో 2003-2004 బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం జరిగింది. కర్నూలు, కడప, అనంతపురం, హైదరాబాదు, చెన్నై,బెంగళూరు  తదితర ప్రాంతాల్లో స్థిరపడిన 60 మంది పూర్వ విద్యార్థులు హాజరయ్యారు. 20 సంవత్సరాల తరువాత కలుసుకోవడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అలనాటి జ్ఞాపకాలను,మధుర స నెమరు వేసుకున్నారు. అనంతరం పూర్వ ప్రధానోపాధ్యా యుడు విజయభాస్కర్ రెడ్డి, అప్పటి ఉపాధ్యాయులైన మౌలాలి, రాజ్ కుమార్‌, సునీల్‌,రమేష్‌,క్రిష్ణయ్య  ఉపాధ్యాయేతర సిబ్బంది బాలస్వామిలను శాలువ, పూలమాలలతో సన్మానించారు. అనంతరం మృతి చెందిన పూర్వ ఉపా ధ్యాయులైన సురేష్‌ వర్మ, నారాయణమ్మ, చిన్నపురెడ్డి, దస్తగిరిలకు నివాళి అర్పించారు. కార్యక్రమంలో పూర్వవిద్యార్థులు పెద్దయ్య,ప్రసన్న కుమార్‌,రవీంద్ర, టిఎన్‌ మహబూబ్‌బాష, సురేఖ, నాగమణి, స్వరూప, రఫి, రియాజ్‌, రమణ, హర్షద్‌లాల్‌ తదితరులు పాల్గొన్నారు.