ప్రజాశక్తి - ముదినేపల్లి
మాల మహానాడు నాయకుడు మద్దాల పురుషోత్తం అకాల మరణం మాల మహానాడుకు తీరని లోటని రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షులు డాక్టర్ సేవా నాగజగన్ బాబురావు తెలిపారు. మండలంలోని కోడూరుకు చెందిన పురుషోత్తం గుండెపోటుతో శనివారం మరణించారు. విషయం తెలుసుకున్న బాబూరావు విచ్ఛేసి పార్థీవ దేహాన్ని సందర్శించి, అంజలి ఘటించారు. కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురుషోత్తం తన సోదరి జిల్లా మాల మహానాడు మహిళా అధ్యక్షురాలు చీలి లావణ్యతో కలిసి ఎన్నో దళిత సంఘాల సమావేశాల్లో పాల్గొన్నారన్నారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని సందర్శించి అంజలి ఘటించిన వారిలో మాదిగ దండోరా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏసుపోగు దానియేలు, జక్కుల విజయకుమార్, గౌస్, ప్రతాప్ తదితరులు ఉన్నారు.










