
ప్రజాశక్తి-గంపలగూడెం: మండలంలోని పలు పురుగు మందుల దుకాణాల్లో శనివారం వ్యవసాయ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పలు అంశాలు వెల్లడైనట్లు డివిజనల్ అగ్రికల్చర్ ఆఫీసర్ డిఏఓ) నాగమణిమ్మ తెలిపారు. గంపలగూడెం లో జరిగిన తనిఖీల్లో ఎరువులు సంబంధించి అనుమతులు లేనట్లుగా తెలుసుకున్నారు. గ్రోమోర్ దుకాణంలో ఎరువులను గోడౌన్‌లో నిల్వ ఉంచే తీరుపై డిఏఓ నాగమణి అమ్మ ఆగ్రహం చెందారు. ఈ విషయాలను వెంటనే సవరించాలని చెప్పి ఆదేశించారు. అదేవిధంగా స్థానిక పిఎసిఎస్‌లో తనిఖీలు నిర్వహించగా, ఎరువులు పురుగుమందుల అనుమతులు విషయమై సమస్యలున్నట్లు గుర్తించారు. మండలంలోని 43 నర్సరీలకు గాను మూడు నర్సరీలే విత్తన లైసెన్స్ కలిగి దీర్ఘకాలికంగా వ్యాపారం చేస్తున్న పరిస్థితులపై ఆరా తీసినట్లు తెలిసింది. సదరు నకిలీ నర్సరీల యజమానులను ఊటుకూరులో సమావేశపరిచి కౌన్సెలింగ్ ఇచ్చినట్లు చెప్పారు. అనతి కాలంలోనే సదర్ నర్సరీలకు అవసరమైన విత్తన లైసెన్సు వగైరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. తిరుగు ప్రయాణంలో తోట మూలలో గల కుమార సాయి జనరల్ ట్రేడర్స్‌లో తనిఖీలు నిర్వహించారు. దుకాణంలో ఉన్న మందుల అమ్మకాలు, కొనుగోళ్ల సాధారణ విషయాలు సైతం రికార్డుల్లో నమోదు చేయలేదన్నట్లు తేలింది. ఈ విషయమై కంప్యూటర్లో నమోదు చేస్తున్నామని యజమానులు తెలుపగా, నాగమణిమ్మ మాట్లాడుతూ మీ దుకాణానికి సంబంధించి అన్ని ఆన్లైన్ లో నేనా అని ప్రశ్నించారు. అనంతరం పి, లైసెన్సులు లేని మందులను షుమారు 6 రకాల పైన గుర్తించి నమోదు చేశారు. స్థానిక ఏవో సాయి శ్రీ దుకాణదారులకు సమస్యలు తలెత్తకుండా (డీఈవో దష్టికి రాకుండా) ప్రయత్నించడం కొసమెరుపు. ఇది ఇలా ఉంటే గతంలో ఇటువంటి సాధారణ తనిఖీలు నెలకు, రెండు నెలలకు జరిగేవి. కానీ ఇటీవల సమస్యలు పెరిగి రైతులు ఇబ్బందులు పడుతున్న సంవత్సరానికి ఒకసారి అయినా అధికారులు దుకాణాల వైపు కన్నెత్తి చూడకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.వచ్చినప్పటికీ శనివారం జరిగిన అరకొర తనిఖీలలా కనిపిస్తున్నాయని, రైతులు విమర్శిస్తున్నారు.