Feb 08,2023 23:00

ప్రజాశక్తి-వత్సవాయి 

పురుగుమందు తాగి దంపతులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని వేములనర్వ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు సమాచారం మేరకు మధిర మండలం మాటూరు పేటకు చెందిన పూట్ట రాజేశ్వర రావు (34)తో నందిగామ మండలం పల్లెగిరి గ్రామానికి చెందిన పూట్ట శ్రీకళ(30)కు 8 సంవత్సరాల క్రితం వివాహం అయింది. వీరిద్దరూ నందిగామ మండలం పల్లగిరి గ్రామంలో అత్తగారి ఇంటిదగ్గర 8 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నారు. అక్కడ నుండి కూలి పనుల కోసం నందిగామ మండలం అనాసాగరంలో కూలి పనులు చేసుకుంటు జీవిస్తున్నారు. సోమవారం రాత్రి అన్నాసాగరం నుండి వత్సవాయి మండలం వేముల నర్వ గ్రామ సమీపంలో చేరుకొని శుభాబులు తోటలో పురుగు మందు తాగి వీడియో కాల్‌ ద్వారా బంధువులకి తాము పురుగు మందు తాగామని సమాచారం ఇచ్చారు. బంధువులు నందిగామ పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేయగా లొకేషన్‌ ద్వారా వేముల నర్వ దగ్గర సుబాబుల్‌ తోటలో గుర్తించారు. పూట్ట రాజేశ్వరరావు, పుట్ట శ్రీకళ ఇద్దరు మృతి చెందారు. మృతునికి ఇద్దరు మగ పిల్ల్లలు ఉన్నారు. పెద్ద కుమారుడు పదవ తరగతి, రెండవ కుమారుడు ఏడో తరగతి చదువుతున్నారు. నందిగామ ఎస్‌ఐ పండు దొర కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.