
ప్రజాశక్తి - చాట్రాయి
మండలంలోని చిత్తపూరు గ్రామానికి చెందిన రోజువారీ కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న కొడవటి ఇశ్రాయేలు(35) అనే కూలీ గురువారం మృతి చెందాడు. స్థానిక చాట్రాయి పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ కెసిహెచ్.స్వామి తెలిపిన వివరాల ప్రకారం చిత్తపూరు గ్రామానికి చెందిన ఇశ్రాయేలు రోజువారి కూలీ పంట పొలాలకు, పత్తి పైరులకు పురుగుమందు పిచికారీ చేస్తాడని యథావిధిగా గురువారం ఒక రైతు పత్తి పంటకు పురుగుమందు పిసికారీ చేయటానికి వెళ్లి ఆ మందు వాసన పీల్చడం వలన స్పృహ కోల్పోయి కోమాలోకి వెళ్లి మరణించినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం పంపించినట్లు తెలియజేశారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు కలరు.