Aug 31,2023 23:06

ప్రజాశక్తి - ముసునూరు
              పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని చక్కపల్లి గ్రామానికి చెందిన మానికల నాగరాజు (26) బి టెక్‌ పూర్తి చేసుకుని గుజరాత్‌లో ఉద్యోగం చేసేవాడు. సెలవులు కావడంతో రెండు నెలల క్రితం చక్కపల్లి వచ్చాడు. ఈ క్రమంలో ఈ నెల 14వ తేదీన నాగరాజును అతని తండ్రి గొర్రెల కాపాలకి వెళ్లమని చెప్పారు. నాగరాజు వెళ్లననడంతో తండ్రి మందలించి పంపించాడు. దీంతో మనస్తాపానికి గురైన నాగరాజు పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అప్పటినుంచి విజయవాడలోని ఓ ప్రయివేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి గురువారం మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ ఎం.కుటుంబరావు తెలిపారు.