
మంగళగిరి రూరల్: మంగళగిరి సబ్ డివిజన్ పరిధిలోని తాడేపల్లి, మంగళ టగిరి, తాడికొండ, తుళ్లూరు పురుగు మందుల నాణ్యత తనిఖీలను నిర్వహించినట్లు ఎడిఎ శ్రీనివాసరెడ్డి తెలిపారు. నకిలీ పురుగు మందుల నియంత్రణ కార్య క్రమంలో భాగంగా పురుగుమందుల దుకాణాల నుండి నాణ్యతపై అనుమానం ఉన్న పురుగు మందుల నమూ నాలు సేకరించి, నాణ్యతా పరీక్షల కోసం పురుగు మం దుల నాణ్యత పరీక్షా కేంద్రానికి పంపినట్లు చెప్పారు. ఆయా మండలాల వ్యవసాయ అధికారులు ఈ తని ఖీలలో పాల్గొన్నట్లు చెప్పారు. తఒమంగళగిరి మండలం నుండి ఇప్పటి వరకు 13 నమూనాలు సేకరించి పంపి నట్లు చెప్పారు. వాటికి సంబంధించి పరీక్ష ఫలితాలు రావాలని చెప్పారు. అలాగే, తాడేపల్లి మండలం నుంచి 6 నమూనాలు, తాడికొండ మండలం నుండి 11, తుళ్లూరు మండలం నుండి 7 నమూనాలు సేకరించి పంపించగా 6 నమూనాలు నాణ్యత ఉన్నట్లు చెప్పారు. మొత్తంగా మంగళ టగిరి సబ్ డివిజన్ పరిధిలో ఇప్పటివరకు 37 నమూనాలు సేకరించి పంపగా, 6 నమూ నాలు నాణ్యతా పరీ క్షలో ఆమోదం పొం దాయని, 31 నమూనా ఫలితాలు రావాలని అన్నారు. గతంలో తాడేపల్లి మండలంలో విత్తన దుకాణాల నుండి సేక రించిన నమూనాల్లో ఒక విత్తన నమూనా నాణ్యతా పరీక్షలో ఫె˜యిల్ అయి తక్కువ నాణ్యత కలిగిన విత్తనంగా నిర్ధారణ చేశారని, ఈ విత్తన నమూనాలో 60 మొలక శాతం ఉండాల్సి ఉండగా, 28 మొలక శాతం మాత్రమే ఉందని కేసు నమోదు చేసినట్లు చెప్పారు. సబ్ డివిజన్ పరిధిలో నాలుగు మండలాల వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు పాల్గొన్నారు.