Aug 22,2023 22:53

మాట్లాడుతున్న డ్వామా పీడీ చిట్టిరాజు

ప్రజాశక్తి - కవిటి: ఇచ్ఛాపురం నియోజకవర్గంలో మొక్కలు నాటే కార్యక్రమం శతశాతం పూర్తి చేయాలని డ్వామా పీడీ జి.వి చిట్టిరాజు అధికారులను ఆదేశించారు. కవిటి, ఇచ్ఛాపురం మండలాలకు చెందిన ఉపాధి హామీ సిబ్బందితో స్థానిక మహిళా సమాఖ్య భవనంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఎస్‌సి, ఎస్‌టి, వికలాంగులకు సెప్టెంబరు నెలాఖరుకు వంద రోజులు పని పూర్తిస్థాయిలో కల్పించాలని సూచించారు. ఫిబ్రవరి 28వ తేదీ నాటికి కూలీల రోజువారీ కూలి రూ.260కి చేరుకోవాలని సూచించారు. సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి కూలీల బ్యాంకు ఖాతాకు ఆధార్‌ లింక్‌, జాబ్‌కార్డ్స్‌, వర్క్‌ ఫైల్స్‌ అప్‌డేట్‌ చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎపిడి ఎస్‌.అమ్మినాయుడు, ఎంపిడిఒ సూర్యనారాయణరెడ్డి, ఎపిఒ శ్రీనివాసరావు, భాస్కరరావు, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.