పార్వతీపురం: జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి ప్రజల నుండి వచ్చిన వినతులను సత్వరమే పూర్తి స్థాయిలో పరిష్కరించి అర్జీదారుల సంతృప్తి స్థాయి పెంచాలని కలెక్టర్ నిశాంత్‌కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో వచ్చిన వినతులను ప్రతిష్టాత్మకంగా తీసుకొని శాఖల వారీగా సత్వరమే పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్.గోవింద రావు, ఐటిడిఎ పిఒ సి.విష్ణుచరణ్, డిఆర్‌ఒ జె.వెంకటరావుతో కలిసి ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించారు. సుమారు 200వరకు వినతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి ప్రజల నుంచి వచ్చిన వినతులను క్షేత్రస్థాయిలో చిత్తశుద్దితో సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఫిర్యాదులు అందించేందుకు జిల్లా కేంద్రానికి వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. కార్యక్రమంలో అన్నిశాఖల జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
జిల్లా పోలీసు కార్యాలయంలో...
పార్వతీపురం రూరల్ : ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారానికి చక్కటి మార్గం స్పందన కార్యక్రమమని ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. సోమవారం స్పందన కార్యక్రమంలో భాగంగా ఆయన తన కార్యాలయంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుండి అర్జీలను స్వీకరించి, అర్జీదారులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకొని, వాటిని క్షుణ్ణంగా పరిశీలించారు. వారి సమస్యలపై సంబంధిత పోలీసు అధికారులతో స్వయంగా ఫోన్లో మాట్లాడి సత్వర న్యాయం అందించేలా కృషి చేయాలన్నారు. స్పందన కార్యక్రమంలో 9 ఫిర్యాదులు అందాయి. కార్యక్రమం లో దిశా డిఎస్‌పి ఎస్‌ఆర్ హర్షిత, ఎస్‌బి సిఐ సిహెచ్ లక్ష్మణరావు, డిసిఆర్‌బి సిఐ ఎన్‌వి ప్రభాకరరావు, ఎస్‌ఐ పాపారావు, సిబ్బంది పాల్గొన్నారు.
ఐటిడిఎ స్పందనకు 63 వినతులు
సీతంపేట : స్థానిక ఐటిడిఎలో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి 63 వినతులొచ్చాయి. పిఒ కల్పనాకుమారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. స్వీకరించిన వినతుల్లో కొన్ని... సిరియా కండి చెందిన ఢిల్లేశ్వరరావు వృద్ధాప్య పెన్షన్, చిన్నగుమ్మడ చెందిన భీమారావు ఆటోలోనూ కోసం, కిరపకు చెందిన శ్రావణి కుట్టు మిషన్ మంజూరు కోరుతూ దరఖాస్తులు అందజేశారు. అలాగే జాడుపల్లి చెందిన గాయత్రి కమ్యూనిటీ హాలు మంజూరు చేయాలని, మల్లి గ్రామానికి చెందిన సవర వెంకటరావు ఆర్థిక సహాయం అందించాలని, మాలువ కాలనీకి చెందిన రత్నాలు గొర్రెల రుణం ఇప్పించాలని వినతులను ఇచ్చారు. కార్యక్రమంలో ఎపిఒ రోషి రెడ్డి, డిడి మంగవేణి ట్రైబల్ వెల్ఫేర్ ఇఇ ఎస్.సింహాచలం, పిహెచ్‌ఒ గణేష్, పిఎఒ హరికృష్ణ, డిప్యూటీ డిఎంహెచ్‌ఒ విజయ పార్వతి, డిప్యూటీ డిఇఒ లిల్లీ రాణి, సిడిపిఒ రంగలక్ష్మి పాల్గొన్నారు.










