ప్రజాశక్తి - ప్రత్తిపాడు : మీకు కేటాయించిన లే అవుట్ పై బాధ్యత లేకుండా పురోగతి లేనప్పుడు వారంవారం నేనెందుకు రావాడం.. అని అధికారులు, సిబ్బందిపై జిల్లా పంచాయతీ అధికారి (డిపిఒ) కేశవరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గృహ నిర్మాణంపై సమీక్ష సమావేశం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిడిఒ శ్రీరమ్య అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. పంచాయతీల వారీగా సమీక్షించిన డిపిఒ మాట్లాడుతూ కేటాయించిన పంచాయతీల్లో లబ్ధిదార్లతో ప్రత్యక్షంగా మాట్లాడి నిర్మాణానికి ఒప్పిస్తేనే లక్ష్యాన్ని చేరుకుంటామన్నారు. పంచాయతీ స్థాయిలో సమావేశానికి వాలంటీర్లు రావడం లేదనే కార్యదర్శులు చెప్పగా చర్యలు తీసుకోవాని డిపిఒ అన్నారు. దీనిపై జీవో కూడా ఉందన్నారు. కోయవారిపాలెంలో 10 మంది లబ్ధిదార్లకు డబ్బులు ఇప్పించడంలో జాప్యంపైనా డిపిఒ అసహనం వెలిబుచ్చారు. వారంలోగా వారికి డబ్బులిప్పించాలన్నారు. సమావేశంలో గృహనిర్మాణ శాఖ ఎఇ సురేష్, పంచాయతీరాజ్ ఎఇ కిషోర్, కార్యదర్శులు పాల్గొన్నారు.










