
ప్రజాశక్తి -కొమరాడ : పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పూర్ణపాడు -లాబేసు వంతెనను పోరాటంతోనే సాధించుకుంటామని సాధన కమిటీ సభ్యులు ఎం.కృష్ణమూర్తి అన్నారు. వంతెన నిర్మాణాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం వంతెన సాధన కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు కోమట్లపేట వద్ద ప్రారంభించారు. దీక్షలో కూర్చున్న సాధన కమిటీ నాయకులకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎం.కృష్ణమూర్తి, ఎపి గిరిజన సంఘం జిల్లా నాయకులు ఎం.తిరుపతిరావు పూలమాలలు వేసి దీక్షలను ప్రారంభించారు. అనంతరం కృష్ణమూర్తి మాట్లాడుతూ
పూర్ణపాడు- లాబేసు వంతెన పెండింగ్ పనుల విషయంలోఇప్పటికైనా పాలకులు ఇచ్చిన మాట ప్రకారం వెంటనే కాంట్రాక్టర్‌ను రప్పించి వంతెన పనులు పున : ప్రారంభించాలని డిమాండ్ చేశారు. కొమరాడ మండలంలో సుమారు 60 గిరిజన గ్రామాలకు ఎంతో ఉపయోగకరమైన ఈ వంతెన 2006లో ప్రారంభించి నేటికి 14 సంవత్సరాలు దాటినా 50శాతం మాత్రమే పనులు చేశారని అన్నారు.సిపిఎం ఆధ్వర్యంలో అనేక విధాలుగా ఆందోళనలు చేసిన నేపథ్యంలో జనవరిలో కాంట్రాక్టర్‌ను రప్పించి పనులు ప్రారంభించినట్లుగా ప్రారంభించి మళ్లీ కాంట్రాక్టర్‌కు నిధులు ఇవ్వకపోవడంతో వెనక్కి వెళ్లిపోయారని అన్నారు. వెంటనే స్థానిక ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి జీవో నెంబర్ 500 ప్రకారం 14 కోట్లు వెంటనే విడుదల చేయించి వంతెన పెండింగ్ పనులు పూర్తిచేసి గిరిజనులకు భరోసా కల్పించాలని అన్నారు. వర్షాలు ఇంకా తీవ్రమైతే మళ్లీ జనవరి వరకు కూడా పనులు చేయడానికి నదిలో వీలు కాదని, కాబట్టి వెంటనే కాంట్రాక్టర్ రప్పించి పెండింగ్ పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈనెల 28వరకు కొనసాగే రిలే నిరార దీక్షలను, 28న తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నాను జయప్రదం చేయాలని కోరారు.
దీక్షలకు టిడిపి మండల కన్వీనర్ ఎం.శేఖరపాత్రుడు, నాయకులు సంగిరెడ్డి మధు, పి.వెంకట్‌నాయుడు, దేవకోటి వెంకటనాయుడు, గులిపల్లి సుదర్శనరావు, బిడ్డిక తమ్మయ్య, కాంగ్రెస్ నాయకులు నిమ్మక సింహాచలం, గిరిజన సంక్షేమ శాఖ జిల్లా కార్యదర్శి పి.రంజిత్‌కుమార్, వృత్తిదారుల సంఘం జిల్లా నాయకులు కోరాడ ఈశ్వరరావు , చినకేర్జల సర్పంచ్ గంగాధర్‌దీక్షలకు మద్దతుగా మాట్లాడారు. దీక్షలో సాధన కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి, వి.ఇందిర, ఎ.ఉపేంద్ర, బత్తిలి శ్రీనివాసరావు, కోలక బుజ్జి, కోలక పురుషోత్తం, నాగేశ్వరరావు, గౌరీ శంకరరావు, నూకరాజు, హెచ్ రామారావు, యు.వెంకటేష్, నాగేశ్వరరావు, కొండగొర్రె అప్పలస్వామి, పకీరు, అప్పలస్వామి పాల్గొన్నారు.










