Oct 24,2023 22:03

భవానీలను ఏర్పాట్ల గురించి అడుగుతున్న ఆలయ చైర్మన్‌

ప్రజాశక్తి - వన్‌టౌన్‌ : ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఈనెల 23వ తేదీ సోమవారం విజయదశమి పండుగ రోజున పూర్ణాహుతి కార్యక్రమంతో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి. అయితే దసరా ఉత్సవాలు ముగిసిన తరువాల మరో మూడు రోజుల పాటు పలు జిల్లాలకు చెందిన భవానీలు మాలాధారణ ధరించి అమ్మవారి మొక్కు తీర్చుకునే సంప్రదాయం ఉంది. ఈ నేపధ్మంలో దసరా ముగిసిన పదవ రోజు మంగళవారం శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకునేందుకు భవానీలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో క్యూ లైన్లు అన్ని ఫుల్‌గా నిండిపోయాయి. క్యూ లైనులో వున్న భవానీలను పాలకమండలి చైర్మన్‌ కార్నటి రాంబాబు స్వయంగా వారిని పలకరించి ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు.,

శ్ర్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న పురందేశ్వరీ
ప్రజాశక్తి - వన్‌టౌన్‌ : దసరా శరన్నవరాత్రుల సందర్భంగా స్థానిక చిట్టినగర్‌లోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారు దసరా ఉత్సవాల తొమ్మిదో రోజైన సోమవారం ఉదయం శ్రీ మహిషాసుర మర్దిని దేవిగా మధ్యాహ్నం నుంచి శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంతో యాత్రికులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజాము నుంచే దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. అమ్మవారిని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు డి.పురందేశ్వరి, సిబిఐ మాజీ జాయింట్‌ డైరెక్టర్‌ లక్ష్మీనారాయణ అమ్మవారిని దర్శించుకోగా వారిని ఆలయ కమిటీ సముచిత రీతిన సత్కరించింది. అదే రోజు సాయంత్రం జరిగిన ఊరేగింపును సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీ నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థానం కమిటీ అధ్యక్షులు లింగిపిల్లి అప్పారావు, కార్యదర్శి మరుపిళ్ళ హనుమంతరావు, కోశాధికారి పిళ్ళా శ్రీనివాసరావు, గౌరవ అధ్యక్షులు బెవర సూర్యనారాయణ మాట్లాడారు. 25వ తేదీ మధ్యాహ్నం దేవస్థానం ప్రాంగణంలో వేలాది మంది భక్తులకు అన్నసంతర్పణకు ఏర్పాట్లు చేశామని చెప్పారు. దసరా ఉత్సవాల కార్యక్రమంలో దేవస్థానం పాలక మండలి ఉపాధ్యక్షులు మరుపిళ్ళ సత్యనారాయణ, బెవర శ్రీనివాసరావు, సహాయ కార్యదర్శులు పొట్నూరి దుర్గాప్రసాద్‌, శీరం వెంకట్రావు, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ కొరగంజి భాస్కరరావు, కార్యవర్గ సభ్యులు పోతిన బేసికంటేశ్వరుడు, మజ్జి ఈశ్వరరావు, మజ్జి శ్రీనివాసరావు, కామందుల నరసింహారావు, భోగవల్లి శ్రీధర్‌, పోతిన వెంకట ధర్మారావు, బంక హనుమంతరావు , బెవర సాయి సుధాకర్‌, పణుకు తదితరులు పాల్గొన్నారు.
దసరా ఉత్సవాల విజయవంతానికి కృషిచేసిన అధికారులకు ధన్యవాదాలు : దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ
ఇంద్రకీలాద్రిపై ఈ నెల 15వ తేదీ నుండి 23వ తేదీ వరకూ జరిగిన దుర్గమ్మ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు విజయవంతం చేసిన అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ధన్యవాదాలు తెలిపారు. విజయదశమి పర్వదినం, దసరా ఉత్సవాల తొమ్మిదో రోజు సోమవారం పూర్ణాహుతి కార్యక్రమంతో దసరా ఉత్సవాలు ముగిశాయి. చండీ హాోమం అనంతరం పూర్ణాహుతి కార్యక్రమ ముగిసింది. ఈ సందర్భంగా మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ ఈ ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించేందుకు శ్రమించిన ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు, నగరపాలక సంస్థ కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుడ్కర్‌, నగర పోలీస్‌ కమిషనర్‌ కాంతి రాణా టాటా, డిసిపి విశాల్‌ గున్ని, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి విధులు నిర్వహించేందుకు వచ్చిన వివిధ స్థాయిల ఉన్నతాధికారులకు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.
అమ్మవారిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్‌ ఢిల్లీరావు
శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విజయదశమి శ్రీ రాజరాజేశ్వరీ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని సోమవారం రాత్రి జిల్లా కలెక్టర్‌ ఎస్‌ ఢిల్లీరావు దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్‌.రామారావు కలెక్టర్‌ డిల్లీరావుకు అమ్మవారి చిత్రపటం అందజేశారు.
కొత్తపేట పోలీసు స్టేషన్లో విజయ దశమి వేడుకలు
విజయవాడ కొత్తపేట పోలీసు స్టేషన్లో దసరా పండుగ పురస్కరించుకుని విజయ దశమి సోమవారం పూజలు ఘనంగా నిర్వహించారు. సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఏ సుబ్రహ్మణ్యం దంపతులు కొత్తపేట పోలీసు ఏర్పాటు చేసిన దుర్గాదేవికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో సబ్‌ ఇన్‌స్పెక్టర్స్‌ ధనలక్ష్మి, శేఖర్‌ బాబు, రాజ నరేంద్ర, షబ్బీర్‌, ఎ.ఎస్‌.ఐలు పూర్ణచంద్ర రావు, రషీద్‌, స్వామి, రైటర్‌ బాబుజీ, కానిస్టేబుల్స్‌ సుబ్బారావు, వెంకట్రాది పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం : శ్రామిక నగర్‌ కనక దుర్గ అమ్మవారి దేవాల యంలో శ్రీ దేవీ శరన్నవ రాత్రి మహో త్సవాలు సోమవారం వైభవంగా ముగి శాయి. కొండపల్లి శ్రామిక నగర్‌ కనకదుర్గ అమ్మవారి దేవాలయం లో నవరాత్రి మహోత్స వాలు నిర్వహించారు. అమ్మ వారికి భక్తులు విశేష పూజలు చేశారు. మహోత్స వాల ముగింపు సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అన్న సంతర్పణ చేశారు. మైలవరం : దసరా మహోత్సవాన్ని పురస్కరించుకొని తొమ్మిది రోజులుగా చేస్తున్న ఉత్సవాలు సోమవారంతో ముగిశాయి. మైలవరంలోని కోట వెనుక ఉన్న కోట మహాలక్ష్మి ఆలయంలోని అమ్మవారిని మంత్రి జోగి రమేష్‌ దర్శించుకున్నారు. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ దంపతులు జమ్మి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరితోపాటు ద్వారకా తిరుమల దేవస్థానం వంశపారంపర్య ధర్మకర్త ఎస్విఎన్‌ నివృతరావు పాల్గొన్నారు. వత్సవాయి: వత్సవాయి పోలీస్‌ స్టేషన్‌ లో దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై అభిమన్య మాట్లాడుతూ ప్రతి ఒక్క కుటుంబం సుఖ సంతోషాలతో నిండి ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లుతెలిపారు.