May 29,2023 21:36

ఎమ్మెల్యేను సన్మానిస్తున్న నాయకులు

ప్రజాశక్తి - కౌతాళం
జిల్లాలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రమైన శ్రీనరసింహ ఉరుకుంద ఈరన్న స్వామి దేవస్థానం అభివృద్ధికి కృషి చేస్తున్నామని మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి పేర్కొన్నారు. సోమవారం దేవాలయంలో రూ.1.28 కోట్లతో నూతనంగా గ్రానైట్‌తో బండ పరుపు పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. స్వామి వారి భక్తులకు సేవలు, సౌకర్యాలు అందించడానికి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా చూడాల్సిన బాధ్యత పాలకమండలిపై ఉందన్నారు. దేవాలయం అధికారులు, పాలక మండలి సభ్యులు భక్తులకు మెరుగైన సేవలు అందించాలన్నారు. దేవాలయంలో అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అంతకుముందు దేవాలయం సహాయ కమిషనర్‌ వాణి, ఆలయ కమిటీ ఛైర్మన్‌ నాగరాజు గౌడ్‌ ఆధ్వర్యంలో పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. దేవాలయంలో ప్రధాన అర్చకులు ఈరప్ప స్వామి, ముఖ్య అర్చకులు అర్చకులు ప్రత్యేక పూజలు చేపట్టారు.
బైక్‌ ర్యాలీ : ఎమ్మెల్యే బాలనాగిరెడ్డికి మండల నాయకుల ఆధ్వర్యంలో మండల సరిహద్దు గ్రామమైన జుమ్మాలదిన్నె నుంచి భారీగా బైక్‌ ర్యాలీ ద్వారా స్వాగతం పలికారు. వైసిపి మండల నాయకులు దాట్ల కృష్ణంరాజు, వీర సేనా రెడ్డి, దేశాయి ప్రహ్లాద చారి, ఉరుకుంద ట్రస్ట్‌ బోర్డ్‌ ఛైర్మన్‌ నాగరాజు గౌడ్‌, ఏకం రెడ్డి, ఎంపిపి అమ్రేష్‌, జడ్‌పిటిసి రాధా ప్రియదర్శిని, వైస్‌ ఎంపిపి బుజ్జి స్వామి, కో ఆప్షన్‌ మెంబర్‌ మాబు సాబ్‌, చెన్నప్ప, బసవ ప్రభు, పాల్‌ దినకరన్‌, చౌదరి బసవరాజ్‌, వడ్డే రాముడు, అబ్దుల్‌ సమద్‌ పాల్గొన్నారు.