
ప్రజాశక్తి-సీతమ్మధార : జివిఎంసి 14వ వార్డు పరిధి సీతమ్మధారలో రూ.2.50 కోట్లతో పునర్నిర్మించిన స్నీపర్ పార్క్‌ను ఉత్తర నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త కెకె.రాజు, వార్డు కార్పొరేటర్ కె.అనిల్‌కుమార్‌రాజుతో కలిసి ఉత్తరాంధ్ర జిల్లాల వైసిపి రీజనల్ కో-ఆర్డినేటర్ వైవి.సుబ్బారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వైవి.సుబ్బారెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుత రోజుల్లో మనిషి ఆరోగ్యం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం పార్కులను అభివృద్ధి చేస్తున్నాట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాద్‌రాజు, మేయర్ హరివెంకటకుమారి, వైసిపి రాష్ట్ర కార్యదర్శి చొక్కాకుల వెంకటరావు, టిడ్కో హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ ప్రసన్న కుమార్, వైసిపి నాయకులు బొడ్డేటి కాశీవిశ్వనాథం, డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకరరావు, జోనల్ కమిషనర్ విజయలక్ష్మి పాల్గొన్నారు.