సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.వెంకటేశ్వర్లు
ప్రజాశక్తి - కుక్కునూరు
పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కోసం నిర్మిస్తున్న పునరావాస కాలనీ వరద ముంపునకు గురవ్వడం ఏమిటని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం పోరుకేక పాదయాత్ర జయప్రదం కోసం కుక్కునూరు మండలంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా దామరచర్ల, చీరవల్లి, దాచారం గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. కివ్వాక పునరావాస కాలనీలో పాదయాత్ర విజయవంతానికి ప్రచారం చేస్తుండగా గతేడాది వచ్చిన గోదావరి వరదలకు సర్వం కోల్పోయి నిరాశ్రయులై సంవత్సరం కాలంగా ఇక్కడే నివాసముంటున్నామని, తమకు ప్రభుత్వం నుండి ఎటువంటి సాయమూ అందలేదని తమ గోడు వెలిబుచ్చారు. నిర్వాసితుల కోసం ప్రభుత్వం నిర్మించిన కాలనీ సైతం గోదావరి వరదలకు మునిగిందని బృందం దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నిర్వాసితుల పునరావాసం కోసం నిర్మించిన కాలనీ మునగడమేమిటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం, ముందుచూపు లేకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందని ప్రభుత్వ తీరును విమర్శించారు. కివ్వాక పునరావాస కాలనీలో తలదాచుకుంటున్న వరద బాధితులకు ఇంటి నష్ట పరిహారం వెంటనే చెల్లించి బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మళ్లీ వచ్చే వరదలను దృష్టిలో ఉంచుకొని ముందస్తు చర్యలు చేపట్టాలని కోరారు. నిర్వాసితుల కోసం సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాదయాత్ర ఈ నెల 26న ఏలూరు జిల్లాలోకి ప్రవేశిస్తుందని, దీనఇన రాజకీయాలకు అతీతంగా ప్రజలంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం నేతలు పిల్లి రామకృష్ణ, యర్రంశెట్టి నాగేంద్రరావు, వలీ పాషా తదితరులు పాల్గొన్నారు.