ప్రజాశక్తి -సీలేరు
2019 ఫిబ్రవరి 14న పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన 40 మంది జవాన్లకు జీకే వీధి మండలం సీలేరు పోలీస్ స్టేషన్లో సిఆర్పిఎఫ్ 42 బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ సురేష్ ఆధ్వర్యంలో సిఆర్పిఎఫ్ పోలీసులు మంగళవారం ఘనంగా నివాళులర్పించారు. అమర జవాన్ల చిత్ర పటాలకు పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ 2019 ఫిబ్రవరి 14న శ్రీనగర్ నుంచి జమ్మూకు కాన్వారు మీద వస్తున్న బలగాలపై ఉగ్రవాదులు దాడి చేసి 40 మందిని పొట్టన పెట్టుకున్నారని తెలిపారు. ఈ రోజును ప్రభుత్వం బ్లాక్ డేగా పరిగణించిందని చెప్పారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో
పుల్వామా అమర జవాన్లకు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ప్రిన్సిపాల్ వినోద్ బాబు, అధ్యాపకులు, విద్యార్థులు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. తల్లిని, చెల్లిని, సతీమణిని విడిచిపెట్టి సరిహద్దుల్లో రక్షణ చర్యలు చేపడుతూ ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారని గుర్తు చేశారు.










