Aug 02,2023 22:35

పులివెందుల బహిరంగ సభలో మాట్లాడుతున్న చంద్రబాబునాయుడు

ప్రజాశక్తి-పులివెందుల టౌన్‌/రూరల్‌/జమ్మలమడుగు రూరల్‌
రాయలసీమను రతనాల సీమగా మారుస్తానని మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. బుధవారం జమ్మలమడుగు నుంచి పులివెందుల వరకు రోడ్‌ షో నిర్వహించారు. గండికోట రిజర్వాయర్‌ను చంద్రబాబు సందర్శించారు. చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ ప్రాజెక్టు వద్ద ఆగిన పనులను కొండలపైకి నడుచుకుంటూ వెళ్లి పరిశీలించారు. రాత్రి ఎనిమిది గంటలకు పులివెందులకు చేరుకున్న రోడ్‌షోకు ప్రజల బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పులివెందుల నాదని, గుండెల్లో పెట్టి చూసుకుంటాననిమ తెలిపారు. పులివెందులకు నీళ్లు తెచ్చిన ఘనత తనదేనన్నారు.
పులివెందులలో వచ్చిన ఉత్సాహం చూస్తుంటే తిరు గుబాటు కనిపిస్తుందని తెలిపారు. చేసిన పాపాలు ఎక్కడికీ పోవు అవే ఇప్పడు శాపాలుగా మారుతాయని అన్నారు. ప్రజలను చూసైన తాడేపల్లి నేతల్లో మార్పురావాలని పేర్కొన్నారు. కృష్ణా జలాలను పులివెందులకు తెచ్చిన ఘనత మాదేనన్నారు. ఆర్టికల్స్‌ అబ్బుగా పులివెందుల తీర్చు దువుతానని, నీరు ఉంటే సిరులు పండించవచ్చు అన్నారు. 2015లో పులివెందుల ప్రాంత రైతుల చీనీ పంటలు ఎండి పోతుంటే గండికోటకు రెండు టిఎంసిల నీళ్లు ఇచ్చి రైతుల ఆనందాన్ని నింపా మన్నారు. పట్టిసీమను నిర్మించడం వల్లే రాయలసీమకు నీళ్లు అందు తున్నాయన్నారు. ప్రాజెక్టుల కోసం టిడిపి ఐదేళ్ల పాలనలో రూ.68 వేల కోట్లు ఖర్చుపెడితే వైసిపి రూ.22 వేల మాత్రమే ఖర్చు పెట్టడం జరిగిం దన్నారు. రాయలసీమకు రూ.12 వేల కోట్లు ఖర్చు చేయడం జరి గిందని, వైసిపి కేవలం రూ.రెండు వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. సింహం ఎప్పటికైనా సింహమేనని పేర్కొన్నారు. నాతో పెట్టుకుంటే తొక్కుకుంటూ పోతానని, రాజధాని లేకుండా చేసిన వ్యక్తి జగన్‌ అని, పోలవరం ప్రాజెక్టు పనులు నిలిచిపోవడానికి కారణం జగన్‌ అన్నారు. బాబాయిని చంపి డ్రామాలాడుతున్నారని జగన్మోహన్‌ రెడ్డిపై ఎద్దేవా చేశారు. మాజీ మంత్రి వివేక కుమార్తె సునీత పోరాటంపై ప్రశంసలు కురిపించారు. నీటిపారుదల మంత్రి ఒక ఆంబోతు మంత్రి అని ఆరోపించారు. తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని, ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం చేసే సౌకర్యం కల్పిస్తామన్నారు. నిరుద్యోగ భృతి ప్రతి నెలా రూ.3 వేల ఇస్తామన్నారు. పులివెందులలో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని బాధ్యత మీ అందరి పైన ఉందని ప్రజలను కోరారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కాల్వ శ్రీనిy ాసులు, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, టిడిపి పొలిట్‌ బ్యూరో సభ్యులు శ్రీనివాసలరెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు దేవగుడి నారాయణరెడ్డి, శివనాథరెడ్డి, బిటెక్‌ రవి, నాయకులు సిఎం.సురేష్‌ నాయుడు
పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత
టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సొంత నియోజకవవర్గం పులివెందులలో ఉద్రికత్త నెలకొంది. చంద్రబాబు పర్యటన ప్రారంభం కానుండగా పులివెందులలోని పూలంగళ్లు సర్కిల్‌ వద్దకు భారీ సంఖ్యలో టిడిపి కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివచ్చారు. అక్కడ అలజడి సృష్టించేందుకు వైసిపి శ్రేణులు యత్నించాయి. వైసిపి జెండాలు పట్టుకుని కారులో వచ్చిన ముగ్గురు కార్యకర్తలు జై జగన్‌ అంటూ నినాదాలు చేస్తూ టిడిపి శ్రేణులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఆగ్రహానికి గురైన టిడిపి కార్యకర్తలు వెంటపడి తరమడంతో అక్కడి నుంచి వైసిపి కార్యకర్తలు వాహనంలో పరారయ్యారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు. రెండు గ్రూపులకు చెందిన వారిపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. ఈ ఘటనతో పులివెందులలో ఉద్రిక్తత నెలకొంది.
చికెన్‌ కొట్టుల్లోనూ ఎమ్మెల్యే వసూళ్లు
ప్రజాశక్తి-జమ్మలమడుగు రూరల్‌
స్థానిక ఎమ్మెల్యే చివరకు చికెన్‌ కొట్టుల్లోనూ వసూళ్లు చేస్తున్నారని, ఇలాంటి ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నందుకు సిగ్గుండాలన్నారు. బుధవారం స్థానిక కోవెలకుంట రోడ్డు నుండి పాత బస్టాండ్‌ వరకు భూపేష్‌రెడ్డితో కలిసి నారా చంద్రబాబు నాయుడు రోడ్‌ షో నిర్వ హించారు. ప్రజలు టిడిపి కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లా డుతూ ప్రజలకు మేలు చేసే ఆలోచనల్లో జగన్‌ లేడని ఎద్దేవా చేశారు. జమ్మలమడుగు ఇసుక హైదరాబాద్‌, చెన్నై, బెంగు ళూరుకు తరలిపోతుందని తెలిపారు. 2024లో భూపేష్‌రెడ్డిని గెలిపించి జమ్మ లమడుగు అభివృద్ధికి కారకులు కావాల న్నారు. ప్రతి నిరుద్యోగ యువతకు ఉపాధి కలిపిస్తానని, రైతుతో పాటు అందరినీ అన్ని విధాల ఆదుకుంటామని తెలిపారు.