ప్రజాశక్తి-పులివెందుల టౌన్/రూరల్/రాయచోటి/కడప/వేంపల్లె : అభివృద్ధికి నిలువెత్తు నిదర్శనంగా తీర్చిదిద్దిన పులివెందుల పట్టణాన్ని దేశానికే ఆదర్శనీయమని ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మో హన్‌రెడ్డి అన్నారు. రెండు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా గురువారం రాయచోటి, పులివెందుల, ఇడుపులపాయలలో పలు కార్యక్రమాలల్లో పాల్గొనే నిమిత్తం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో సిఎం జగన్ కడప విమానాశ్రయానికి చేరుకున్నారు. మొదటి రోజు పులివెందుల మున్సి పాలిటీ పరిధిలో రూ.64.54 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంఖుసా ్థపనలు చేశారు. అంతకు ముందు అన్నమయ్య జిల్లా రాయచోటిలో శాసన మండలి డిప్యూటీ చైర్‌ప ర్సన్ జకియా ఖానం, మాజీ ఎంపిపి గౌస్ మహ్మద్ రఫీ కుటుంబాల వివాహ కార్యక్రమానికి హాజర య్యారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా మధ్యా హ్నం 1.30 గంటలకు పులివెందులకు చేరుకు న్నారు. భాకరాపురం వద్ద రూ.4.54 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన శ్రీకృష్ణ దేవాల యాన్ని ప్రారంభించారు. ఎపి కార్ల్‌లో రూ.9.96 కోట్లతో నిర్మించిన అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ కాలేజీ, రూ.11 కోట్లతో నిర్మించిన స్టేట్ ఆఫ్ ఆర్ట్ సెంట్రల్ టెస్టింగ్ లాబొరేటరీ, రూ.14.04 కోట్లతో నిర్మించిన శిల్పారామంను ప్రారంభించారు. 60 కోట్లతో నిర్మించనున్న శ్రీ స్వామి నారాయణ గురుకుల పాఠశాలకు ముఖ్యమంత్రి శంఖుస్థాపన చేశారు. అనంతరం ఆదిత్య బిర్లా యూనిట్‌ను సందర్శించారు. కడప, అన్నమయ్య జిల్లాల కార్యక్రమాల్లో ఆయా జిల్లాల ఇన్‌ఛార్జి మంత్రులు ఆదిమూలపు సురేష్, కాకాని గోవర్ధన్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా, కడప, రాజంపేట ఎంపీలు వైఎస్.అవినాష్‌రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఎమ్మెల్సీలు రామచంద్రారెడ్డి, సి.రామచంద్రయ్య, పి.రామసుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్‌రెడ్డి, రఘురామిరెడ్డి, రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, దాసరి సుధ, శ్రీకాంత్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, ధారక నాథరెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, నవాజ ్‌బాషా, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమర్‌నాధ్‌రెడ్డి, డిఐజి సెంతిల్ కుమార్, కలెక్టర్లు విజరురామరాజు, గిరీష, ఎస్‌పిలు సిద్దార్థ్ కౌశల్, కృష్ణారావు, జెసిలు గణేష్ కుమార్, ఫర్మాన్ అహ్మద్‌ఖాన్, పాడా ఒఎస్‌డి కృష్ణమోహన్‌రెడ్డి, ఆర్‌డిఒ మధుసూదన్, పులివెందుల పురపాలిక చైర్మన్, వైస్ ఛైర్మన్‌లు వరప్రసాద్, వైఎస్ మనో హర్‌రెడ్డి పాల్గొన్నారు. పులివెందులలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం సాయ ంత్రం 5.50 గంటలకు ఇడుపులపాయ ఎస్టేట్‌లో ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి బస చేశారు. ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్‌రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందులకు రావా లంటే భారీగా బారికేడు, పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అడుగుడుగునా ఆంక్షలు విధించారు.
సిఎంకు పెద్దరంగాపురం గ్రామస్తుల వినతి
పులివెందుల ప్రాంత అభివృద్ధి కోసం 2009లో భూములు ఇచ్చిన వారికి ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇవ్వడంతో కోట్లు విలువ చేసే సుమారు ఎపి కార్ల్‌కు 650 ఎకరాలను ఇచ్చామని, ఉద్యోగాలు ఇవ్వాలని పెద్దరంగాపురం గ్రామ ప్రజలు సిఎం జగన్‌కు వినతిపత్రం సమర్పించారు. నాటి హామీని అధికార యంత్రాంగం, ప్రజాప్రతి ప్రతినిధులు గాలికి వదిలేసారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే భూములు ఇచ్చిన వారికి ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇవ్వాలని కోరారు. సిఎం వెంటనే కలెక్టర్‌కు సమస్యను పరిష్కరించాలని సూచించారు.