
గుంటూరు : పులిచింతల ప్రాజెక్టు 16 వ నెంబర్ గేటు వద్ద వరదలో కొట్టుకుపోయిన గేటు స్థానంలో స్టాప్ లాక్ గేట్‌ను అధికారులు అమర్చారు. 11 ఎలిమెంట్లను టెక్నికల్ సిబ్బంది ఏర్పాటు చేశారు. అన్ని గేట్లను మూసేసి ప్రాజెక్టులో నీటి నిల్వ చేపట్టారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 7 టిఎంసిల నీరు నిల్వ ఉంది. ప్రస్తు ఇన్ ఫ్లో 39690 క్యూసెక్కులుగా నమోదయింది.