Aug 03,2021 08:44

సూర్యాపేట : ఎగువ నుండి చేరుతున్న భారీ వరద కారణంగా... పులిచింతల ప్రాజెక్ట్‌కు వరద ఉధృతి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అధికారులు ప్రాజెక్టు 10 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. పులిచింతల ఇన్‌ ఫ్లో 2,12,992 క్యూసెక్కులు కాగా, ఔట్‌ ఫ్లో 2,69,336 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. పులిచింతల పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులు కాగా, ప్రస్తుతం 172.76 అడుగులుగా ఉంది. పులిచింతల పూర్తిస్థాయి నీటినిల్వ 45.77 టిఎంసి లుగా ఉండగా, ప్రస్తుతం 42.34 టిఎంసి లుగా ఉంది. ప్రాజెక్ట్‌ నుంచి విద్యుదుత్పత్తి కోసం 13,200 క్కూసెక్కుల నీటిని విడుదల చేశారు. నాలుగు యూనిట్ల ద్వారా 30 మెగావాట్ల విద్యుదుత్పత్తి కొనసాగుతుంది.