అవార్డు అందుకుంటున్న కోటేశ్వరరావు
ప్రజాశక్తి-చెరుకుపల్లి: మహాత్మ జ్యోతిరావు పూలే జీవిత సాఫల్య టీచర్ అవార్డును మండల పరిధిలోని ఆరేపల్లి ఎంపీ యూపీ పాఠశాల ఉపాధ్యాయులు మరదప కోటేశ్వరరావు అందు కున్నారు. పూలే జయంతి సందర్భంగా తిరుపతిలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి బి చంద్రకుమార్ తదితర ప్రముఖుల చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఈ మేరకు మండల ఉపాధ్యాయ నాయకులు పలువురు కోటేశ్వరావును అభినందించారు. ఎంఈఓ టి నవీన్ కుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు గురునాథం, నాయకులు కాటూరి నాగేశ్వరరావు, బి సాంబయ్య నాయక్ తదితరులు అభినందించారు.










