Nov 28,2022 23:52

పూలే చిత్ర పటానికి నివాళులర్పిస్తున్న కలెక్టర్‌ రవి

ప్రజాశక్తి-అనకాపల్లి
మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కలెక్టర్‌ రవి పటాన్‌ శెట్టి పిలుపునిచ్చారు. జ్యోతిరావు పూలే 132వ వర్థంతి సందర్భంగా సోమవారం కలెక్టరేట్‌లో పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులం పేరుతో తరతరాలుగా అణచివేతకు గురవుతున్న బడుగు బలహీన వర్గాలకు చదువు ప్రాముఖ్యతను వివరించిన ఆశాజ్యోతి పూలే అని గుర్తు చేశారు. కార్యక్రమంలో డిఆర్‌ఒ వెంకటరమణ, జిల్లా బీసీ వెల్ఫేర్‌ అధికారి రాజేశ్వరి, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
టిడిపి పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు బుద్ధ నాగ జగదీశ్వరరావు ఆధ్వర్యంలోనూ, స్థానిక నెహ్రూ చౌక్‌ జంక్షన్‌లో అఖిలభారత బిసి ఫెడరేషన్‌ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు విల్లూరి ఫైడారావు ఆధ్వర్యంలోనూ, సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జొన్నకోట చెన్నమూర్తి ఆధ్వర్యంలోనూ పూలే వర్థంతి నిర్వహించారు. సిపిఐ కార్యాలయంలో సామాజిక హక్కుల వేదిక జిల్లా గౌరవ అధ్యక్షులు రాజాన దొరబాబు పూలే చిత్ర పటానికి పూలమాల శ్రద్ధాంజలి ఘటించారు.
దేవరాపల్లి : మండలంలోని తారువలో ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు కార్యాలయంలో జెడ్‌పి స్త్రీ శిశు సంక్షేమ శాఖ స్టాండింగ్‌ కమిటీ చైర్‌పర్సన్‌ ఈర్లె అనురాధ జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో దేవరాపల్లి, మాడుగుల, చీడికాడ, కె.కోటపాడు ఎంపీపీలు కిలపర్తి రాజేశ్వరి భాస్కరరావు, వేమవరపు రామ ధర్మజ, కురచా జయమ్మ నారాయణమూర్తి, రెడ్డి జగన్మోహన్‌, జెడ్పీటీసీలు కర్రి సత్యం, కిముడు రమణమ్మ, వైసిపి నాయకులు బూరె బాబురావు, గొల్లవిల్లి రాజబాబు, వైస్‌ ఎంపీపీ చింతల బుల్లిలక్ష్మి సత్య వెంకటరమణ, ఉర్రుకల గంగాభవాని అప్పారావు, గవర కార్పొరేషన్‌ రాష్ట్ర డైరెక్టర్‌ దాడి జగన్‌, సర్పంచులు చల్లా లక్ష్మీ నాయుడు, రొంగలి వెంకటరావు, గొర్రెపోటు సుధారాణి సారథి, నాగిరెడ్డి సటారీనాయుడు పాల్గొన్నారు.
ఎస్‌.రాయవరం : బడుగు బలహీనవర్గాలకు అండగా నిలిచిన మహౌన్నత వ్యక్తి జ్యోతిబాపూలే అని శాసనసభ్యులు గొల్ల బాబురావు కొనియాడారు. జ్యోతిబాపూలే వర్ధంతి సందర్బంగా కోరుప్రోలు లోని క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల హక్కుల సాధన కోసం దేశంలో కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి జ్యోతిబాపూలే అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.